సోషల్ డిస్టెన్స్(కవిత )-

నాదేశంలో 

ఎప్పుడో వుంది 

సోషల్ డిస్టెన్స్ 

కొత్తగా ఏముంది 

అంతా తప్పట్లు తాళాలు 

గుడిసెలో

ఓ వార వంట మరో పక్క పడక

ఐసోలేషన్ కి చోటెక్కడ 

రోడ్డు వార పగలు కష్టం

ఇంత తిని ఆడే పడక 

పబ్లిక్ ఐసోలేషన్ చోటది

మనిషి వేరుపడ్డాడెన్నడో 

గొందుల్లో సందుల్లో వాడల్లో 

అదేమీ విరుగుడు కాలేదే చావుకి  

మనిషిని చంపుతూనే వుంది 

మందులెరుగని గూడేలెన్నో 

రహదారులే లేని పల్లెలెన్నో 

ఆసుపత్రి మొహం వాచిన కళ్ళెన్నో 

చికిత్స నివారణోపాయాలు 

సంగతులు నిధులు 

అత్యవసరమైననూ 

చప్పట్ల మోత 

మొక్కిన దేవుళ్ళే 

బలవంత ఐసోలేషన్లల్లో 

ఇప్పటికైనా హుండీలు 

ఆసుపత్రులకై కదులుతాయా 

స్వస్థత మహాసభల

హిస్టీరియా బహిర్గతమౌతుందా 

వైద్యం వితరణ లో 

మానవత్వం 

మౌలికవసతుల సృష్టి 

ఏలిక ధర్మం 

కరోనా పై జయం లో 

కాగడాలు 

ప్రజారోగ్య సిబ్బంది

కరోనా చుట్టూ

కంచెల నిర్మాణంలో వైద్య సిబ్బంది 

కరోనా మర్నా 

ఆద్మీ జీనా 

ప్రపంచ నినాదమిప్పుడు 

                                – గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Vinay kumar
Vinay kumar
9 months ago

అద్భుతంగా రాసారు

Giriprasad Chelamallu
Giriprasad Chelamallu
8 months ago
Reply to  Vinay kumar

Thank you sir