అంతేగా ! అంతేగా !(కవిత )-యలమర్తి అనురాధ

 పాత రోజులు రావాలని

 ఎన్ని కలలు కన్నానో

 కోరిక తీరింది 

 ఇలా అనుకోలేదే?

 షేక్ హ్యాండ్ అంటేనే నచ్చేది కాదు 

 ముచ్చటైన మన నమస్కారమే ముద్దని 

 పరిశుభ్రత పట్టించుకునేవారే లేరు 

 భాధపడని రోజు లేదే

 పదే పదే ఇప్పుడా పనిలోనే

పబ్బులు డేటింగ్ లు మన సంస్కృతి కాదే

వైరస్ భయంతో మొత్తం మూతపడ్డాయి విచ్చలవిడితనమంతా కట్టడి అయ్యిందే

కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు

అనుబంధాలు వెల్లి విరుస్తున్నాయి

మాటల సందళ్ళు మొదలయ్యాయి

అంతా బాగుంది కానీ 

దిగులు మేఘం వెన్నంటే తరుముకొస్తోందే

అదొక్కటీ మాయమైతే 

కరోనా మంచిదే

అంతేగా ! అంతేగా !

మరక మంచిదే అంటే ఏమో అనుకున్నా !

కరోనా కూడా అంతే కదా !

-యలమర్తి అనురాధ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Vinay kumar
Vinay kumar
9 months ago

అంతేగా