కులం(కవిత )-గిరిప్రసాద్ చెలమల్లు

తండ్రి తల్లి
బిడ్డల మధ్య సైతం అగాధం

పిల్లల ప్రేమలో
కులం వీక్షణ

బెదిరింపులు
అదిరింపులు
హత్యలు కులం పునాదిగా

అండగా ఆధిపత్య సంఘాలు
కులానికో సత్రం
కులానికో భవనం
కులాల ఓట్ల రంకు భాగోతాలు

పోయిన ప్రాణం ఏ కులం తెస్తుంది?
పోయిన సహచరుల ఙ్ఞాపకాల్లో
శేష జీవితమంటే ఎన్ని ఒడిదుడుకులో
ఎగాదిగా పొడిచే కుల రాబందులు

తోడు సామాజిక వికాసావసరం
తోడు మనిషి మాత్రమే
తోడు లో కులం పాత్ర దురదృష్టం
హత్యలు ఆత్మహత్యల ఒరవడిలో
తోడు తుత్తినియలు

కులం కూడు పెట్టదు
ఛాందసాన్ని కూడ బెడతది
ఎగదోస్తది తప్పుకుంటది
ఎన్నెన్నో కుటుంబాల్లో చిచ్చు
చచ్చుబడిన మనస్తత్వాల్లో తిష్ట
తొలిచితొలిచి
సమాజ విచ్ఛిత్తి

కులం మరణ శాసనం
కులం మరణ మృదంగం
కులపుట్టుక స్మృతి దహనం
మనసుల్లో జరిగేదెన్నడో
పచ్చని జంటల కిలకిలారావాలు
స్వేచ్ఛగా వినిపించేదెన్నడో

                                                               – గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.