ముట్టు’కుని చూడు(కవిత )– నస్రీన్ ఖాన్

సమాజం ఎలా తోసిందో
ఎప్పుడు ఎక్కానో
గుంజ మీదుగానే
లోకం చూసే అవకాశం
భూమ్యాకాశాల మధ్య తేలియాడుతానని స్పృహకైనా రానీయలేదు

పొడవాటి తాడుపైనే నడక
అడుగు అడుగుకీ సమతూకంలో కొట్టుమిట్టాడే బతుకు పోరు
కదిలిన ప్రతిసారీ ఈలలూ చప్పట్లూ కేరింతలు
అవి చావూ బతుకులను రెండు భుజాలపై మోస్తూ ముందుకెళ్ళే ప్రతిభకు కాదు
అచ్చంగా దేహానికి అతుక్కుపోయిన కొలతలవి

తలపై కిందకు చూడలేనంత బరువు
నేలపై కాలిని మోపలేనంత వ్యత్యాసం
వీటి నడుమ నాకంటూ ఇంత జాగా కోసం తనుకులాట
నన్ను సతమతంలోకి నెట్టి వినోదించాలనే లోకం కుట్రను తప్పించుకునే తపన
అడుగులు పడేది ముందుకే

విలాస జీవితాలకై అందరి పోటీ పరుగులు
నలుసుగా కడుపులో ఉనికి నుంచి మొదలవుతుంది నా జీవన్మరణ యుద్ధం
ఊపిరిపోసుకున్నా లోకాన్ని చూస్తానో లేదో
భూమ్మీదకు అడుగు పెట్టినా నూకలున్నాయో లేవో
నా నూకలు నేను తిన్నా సీతాకోకనై రెక్కలల్లార్చగలనో లేదో
విహరిస్తున్నా ఏ వైపు నుంచి ఏం ముంచుకొస్తుందో
గాల్లో దీపాన్ని అయినందుకు నేను కదా ప్రతీక్షణం భీతిల్లాలి

మరి నీకెందుకు అంత భయం
నా దేహధర్మమే కదా ఈ ప్రపంచానికి నిన్ను పరిచయించింది
ఆ ధర్మమే ఈరోజు నీ ఆంక్షలు వినిపించేలా చేస్తోంది
నేను కన్నది నీ పుట్టుకనే
పుట్టుక కాదు పాపం
కనడమూ కాదు పాపం

ఈ ముట్టునుంచే నీవు అంకురించావు
ఈ రక్తమే నీకు రూపమైంది
ఈ నెలసరే నీకు మాటై పెగులుతోంది
నా రుధిరం నా అంత స్వచ్ఛం
నా స్పర్శ నీ పుట్టుకంత పవిత్రం
నాకు నెల నెలా ఆంక్షలైతే నీకు జన్మమంతా నిషిద్ధమే
ఆలోచించు!

సరే కానీ,
అంటు అంటూ నన్నెందుకు బాధిస్తావ్
నన్ను ‘ముట్టు’కుని చూడు
మనిషిలా చూడు
పాపపు లెక్కల బరువులు సర్వాంతర్యాములకు వదిలేయ్

                                                                                   – నస్రీన్ ఖాన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to ముట్టు’కుని చూడు(కవిత )– నస్రీన్ ఖాన్

  1. శీలా సుభద్రా దేవి says:

    కవిత ఎత్తుగడ నుండి చివరివరకూ సమతూకం లో కవిత నడిపించిన తీరు గడ మీద సాము లాగే ఉంది.అభినందనలు నస్రీన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)