ఆశ్చర్యమే !- యలమర్తి అనూరాధ

అమ్మాయి పుడితే
అమ్మవారికి నిలువెత్తు బంగారం (బెల్లం)ఇస్తానని
మా పని అమ్మాయి మ్రొక్కుకుందని తెలిసి అవాక్కయ్యా
లక్షణమైన పిల్ల పుట్టిందని
లక్ష ఖర్చు చేసి ఆనందంగా
వేడుక చేస్తున్నానంటే ముచ్చటేసింది
బంధువులను స్నేహితులను జత చేర్చుకొని ప్రయాణానికి సన్నద్ధం అయ్యిందంటే
ఆ క్షణం మరువలేనిదే
శుభ పరిణామాలకు నాందని అనుకోవచ్చు మార్పు సహజమే అన్న తలపు
మదికి తెచ్చింది పులకరింపు
ఒక వంక అన్యాయంగా
ఆడపిల్లలు బలి అవుతున్నారన్న వ్యధ
మనసును క్రుంగతీస్తున్నా
అన్నింటా తానై నింగిని తాకుతున్న ఆమె విజయాలు
కన్నుల్లో తారకల్లా వెలుగులు పంచుతున్నాయి ఆకాశంలో సగం అంటారే
50% రిజర్వేషన్ కి అమ్మలు రాజ్యమేలినా
చట్టం చూపు పడనే పడదు
ఇదే జరిగితే జయం సాధించినట్లే
ఎంత ఎత్తుకు ఎదిగినా
మగవారి అహంకారం ఆజ్ఞల క్రిందే పడతి
సడలింపు నేపథ్యం సాగితేనే
గెలుపు జెండా ఎగురవేసినట్లు లెక్క
ఎక్కువ తక్కువ లెక్కలు మనకొద్దండీ
సమానత్వం పాటిస్తే చాలు
స్త్రీ స్వేచ్ఛ ఉన్నతి కలగలిస్తే
అభివృద్ధికి బాట వేసినట్లే!

                                                                 -యలమర్తి అనూరాధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to ఆశ్చర్యమే !- యలమర్తి అనూరాధ

  1. వనజ తాతినేని says:

    బాగుంది అనూరాధ గారూ … ఆడపిల్ల అన్నింటా తానే నిలిచే రోజులే ఇవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)