సంపాదకీయం -మానస ఎండ్లూరి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సంప్రదాయానికి మాత్రమే ఇంట్లో ఆడవారి పేరును, వారి ఉనికి గుర్తుపెట్టుకున్నట్టే ఈ మార్చ్ 8 అనేది కూడా ఎప్పుడో సారి స్త్రీలను గురించి గుర్తుకు తెస్తుంది. అలా అని అసలు స్త్రీ చైతన్యమే లేదా అంటే ఉంది. ఎంత సాధించిన స్త్రీ అయినా ఒక తక్కువ వర్గానికీ అశక్తతకు సంబంధిన ఆమె గానే చూడడం కూడా ఇంకా ఉంది. ఇక మీదట కుడా ఉంటూనే ఉంటుంది అన్న నిరాశ కూడా ఉంది. భారతీయ మహిళ ఫలనా ఘనత సాధించింది అని చెప్తూనే ఉన్నా ఆమె అడుగు పెట్టని అంశాలు, వేదికలు మిగిలే ఉంటున్నాయి. భారతీయ మహిళను వర్గ కుల మత ప్రాంత రహితంగా చూడడానికి ఎటువంటి అవకాశం లేదని ఎన్నో సార్లు చూస్తూనే ఉన్నాం. దేశానికి ఐదు బంగారు పతకాలు తెచ్చిన ఏ భారత స్త్రీ అయినా సమానం కాదు. ఒకరికి లక్షల కొద్దీ డబ్బు ఆస్తులు ఖరీదైన కార్లు వస్తాయి. మరొకరికి అదే గెలుపును నిలబెట్టుకోడం సవాలుగా మారుతుంది. ఇంకొంతమంది అవే బంగారు వెండి కాంస్య పతకాలను తమ పూరి గుడిసెల్లో గోడకు వేలాడదీసి పాచి పనికీ పానీ పూరీలు అమ్ముకోడానికీ వెళ్ళాల్సి వస్తుంది. స్త్రీలలోనే ఉన్న ఈ దూరాన్ని ఈ నిస్పృహ ని మనం గమనిస్తున్నామా? 

మరో పక్క స్త్రీ సాధించిన వియజాన్ని, ఘనతని పురుషుడు తన ఖాతాలో వేసుకోడం, ఏం సాధించాలి ఎలా నెగ్గాలి అని పురుషుడే సూచించడం ఇంకా ఆధునిక సమాజంలో కనిపిస్తూనే ఉంటుంది. ఆ విషయాన్ని కనీసం గ్రహిస్తున్నామా? ఇటీవల పేరు పొందిన ఎన్నో సినిమాల్లో ఇది చూస్తూనే ఉన్నాం. ‘పింక్’ లో ఆడపిల్లల పక్షాన మాట్లాడే వృద్ధ వకీలు ఒక స్త్రీ కాలేదు. ‘ఆర్టికల్ 15’ లో దళిత బాలికలపై హింస అత్యాచారాల చుట్టూ తిరిగే ఈ సినిమా లో ఎక్కడా వాళ్ళు కనిపించరు, వాళ్ళ ఆక్రందన ఆవేదన కనిపించదు. కనువిప్పు గలిగిన ఒక బ్రాహ్మణ పురుష పోలీస్ ఆఫిసర్ మాత్రమే కథంతా ఆక్రమిస్తాడు. ఇస్రో లోని ఐదుగురి మహిళా శాస్త్రవేత్తల కథను ఒక్క అక్షయ్ కుమార్ మనకు చూపిస్తాడు. ఇట్లా మన నిత్య జీవితాల్లో ఉన్నవే ఎటువంటి రగడ లేకుండా మనం తెర మీద కూడా చూసేస్తున్నాం.

స్త్రీ ఎప్పుడు ఒక చర్చా వస్తువే. కానీ చర్చించేది కూడా స్త్రీనే. అదే సమస్య. ఈ మధ్య కాలంలో మహిళల రక్షణ కు సంబంధించ ఒక మహాసభలో అందంగా తయారైన ఆడవారు పళ్ళేలలో బహుమతుల్ని మైకుల్ని అందించడం, అధ్యక్షుడిగా ఒక పురుషుడు స్త్రీల త్యాగాలని సహనాన్ని గురించి గొంతు చించుకోడం చూసి మళ్ళీ మళ్ళీ అదే నిస్సహాయతకి గురయ్యాను. దీని మీద ఏ ఒక్కరికీ ఎందుకు ఒక చిన్న స్పృహ కూడా కలగడం లేదని ఎంత కాలం ఆశ్చర్యపోవాలి మనం? అత్యాచారాలు జరిగే కొద్దీ ఆ బాధితురాలి పేరున కొత్త చట్టాన్ని కొత్త పోలీస్ స్టేషన్లని నిర్మించుకోడమే కాక కొత్త ఆలోచనల్ని మనం ఎప్పుడు నిర్మించుకుంటాం? 

నిజానికి మనం సభలు చర్చలు జరపాల్సింది మహిళా దినోత్సవం నాడు కాదు. పురుష దినోత్సవం నాడు పురుషులు మాట్లాడాలి. తోటి వర్గం పట్ల ఎలా నడుచుకుంటున్నారో వారు చర్చించుకోవాలి. మహిళల దినోత్సవాన్ని ఎలాగు కొందరు ఎలీట్ ఫెమిన్సిస్ట్లు ఒక అట్లా తద్ది లానో ఒక హౌస్ పార్టీ లానో చేసారు. ఇక పురుషులు మాకు సంబంధించిన అంశమే కాదని దూరం ఉంటారు. కళాశాలలలో జరిపినా విద్యార్ధులు రారు. అదొక విద్యార్ధినుల వ్యహహారం అన్న అపోహ. 

ముందడుగు వెయ్యాలసింది స్త్రీ అయినా గొంతు విప్పాల్సింది పురుషుడే!

-మానస ఎండ్లూరి 

`~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~       

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)