ఆడపిల్లనే నేను (కవిత )- గిరిప్రసాద్ చెలమల్లు

నేను 

నా అడవి 

నా కోసం  అడవి

అహర్నిశలు అడవికై నేను 

 

అడవి నా 

నా బిడ్డల ఆకలి తీరుస్తుంది

నేను నా సావాసం అడవితో అనాదిగా 

నా దరికే దినోత్సవం రాదు 

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు

మైదానంలో ఒక్క రోజు 

అడవిలో ఏనాడైనా ?!!!

 

ఆ మూడురోజుల బాధల్లో

ఆకులో అలములో నాకు రక్ష 

రక్తహీనత రక్షలో నేనెరిగిన తరాల వైద్యం నా అడవిలోనే 

 

అక్షరమెరుగని నేను 

సూదిమందు ఎరుగని నేను 

పుట్టుక నుండి చావు దాకా 

వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం నేర్పింది అడవి యే 

నిప్పు పుట్టించింది  నేనే

 

కట్టుబాట్లు ఆచారాల పేర

పట్టుమని పదేళ్ళు నిండక పెళ్ళి బంధనాల్లో

చిక్కి 

బాల్యంలోనే పురుళ్ళతో చిక్కిశల్యమౌతున్నా నేను 

 

సంఘమంటే ఎరుగని నేను 

జంతువులతో మసలుకుంటా మనసెరిగి 

నన్ను మించిన సైకియాట్రిస్ట్ లేడు సుమా !!

 

నా కోసం గళం విప్పిన 

నా తోటి బిడ్డల పానం తీసిన మైదానం చట్టాలు

నా చట్టాలను తొక్కిస్తూ త్రుంచేస్తూ 

మైదానపు ఆర్థిక బంధువులు మా ఇలాకాలోకి చొరబాటు

 

పొట్టకూటికోసం 

అడవి వెంట మేము నడుస్తూ పోతుంటే 

అది రాష్ట్రమో దేశమో తెలీదు 

ఎల్లలు ఎరుగని నాకు ఆధారాల్లేవ్ 

పాస్ పోర్టులు లేవూ 

నేను ఈ నేల బిడ్డనే 

ఏం చూపాలి నేను పౌరసత్వం కోసం 

 

నా పూర్వీకుల ఆటలు 

నా సంస్కృతిలో సజీవం 

అడవి వాయిద్యాలు నా ఇంట్లో పదిలం 

ఈ దేశ మూలవాసి నా గర్భంనుండేననేది నా చరిత్ర 

ఎన్నో గర్భాల విచ్ఛిత్తి వైద్యం అందక నేడు 

నిండుచూలాలినైన నన్ను జోలెలో మోస్తున్న రీతి 

ఎన్ని మహిళా దినోత్సవాలు జరిగినా 

నా గూడేల్లో నా బతుకుల్లో వెలుగులు నింపలేవ్ 

ఆదివాసి ఆడపిల్లని నేను 

భీమాకోరేగావ్ యుద్ధవీరుల కన్నతల్లి ని 

చరిత్ర లో ఎందరో పోరాట యోధులని కన్న పేగు నాది 

ఎవడురా!నన్నడిగేది ఋజువులు !

చరిత్రంతా నాదే !!

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా )

                                                                                                                – గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

11 Responses to ఆడపిల్లనే నేను (కవిత )- గిరిప్రసాద్ చెలమల్లు

 1. రమణి says:

  ఆడపిల్ల గురించి అద్భుతంగా చెప్పారు…

 2. నరేంద్ర says:

  మనసు పిండ్డేసింది కవిత.. చక్కగా వివరించారు

 3. శ్రీరామ్ says:

  బాగా రాసారు..ఆలోచింప జేశారు గిరిగారు…

 4. వనజ తాతినేని says:

  బాగుంది.

 5. కుసుమ says:

  గిరి గారు కవిత బాగుంది…చాలా బాగా చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)