గజల్-10 -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సుమాంజలి.
ఇందులో ప్రేమికుని విరహం , వేదన కళ్ళకు కట్టినట్లుగా
కనబడుతుంది. బాధ లేకుంటే గజల్ లేదని అంటారు
చాలామంది గజల్ ప్రేమికులు. అనువాదం చేసినప్పుడు
ఎదో బుక్ లో చూసి చేసాను. ఆ తర్వాత గజల్ మూలం
దొరకలేదు. అయినా లోతైన భావాలను ఆదరిస్తారని ఈ గజల్
మీకోసం అందిస్తున్నాను.

(మూలం దొరకక పోవడంతో కేవలం అనువాదం అందిస్తున్నాను )

ఎప్పటికీ ఈ విరహం నన్ను వదిలి వెళ్ళదులే
కాలికున్న ఈ బంధము చోటునొదిలి వెళ్ళదులే

వ్యథలన్నీ రాసేందుకు వ్యతిరేకత ఉందేమో
లేకుంటే కంటనీరు బుగ్గనొదిలి వెళ్ళదులే

కావాలని నాకంటే ముందు వెళ్లిపోయావు
లేకుంటే నా ఊపిరి నిన్ను వదిలి వెళ్ళదులే

షి(శి)కారీని వేటాడుట నేను కోరుకోలేదుగ
లేకుంటే ఏ శరమూ వైరినొదిలి వెళ్ళదులే

నీవెళ్ళిన సమయాలను చూసాలే నెలరాజా
లేకుంటే నా శ్వాసే గుండెనొదిలి వెళ్ళదులే.

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.