మాతృభాషను పరిరక్షించండి…(కవిత) -వెంకట్ .కె


ఆంగ్లమోజులో అమ్మ భాషను మరువకురా బిడ్డా

ఆలి వచ్చిందని అమ్మను వదిలేస్తావా

నాలుగింగులీసు ముక్కలొచ్చాయని అచ్చతెలుగును మరిచిపోతావా

‘దేశభాషలందు తెలుగులెస్స’ అని శ్రీనాథునిచే చెప్పబడి

శ్రీ కృష్ణదేవరాయులచే ఘన కీర్తిని పొందానురా

విదేశీయులయిన
రాస్మస్‌జార్జ్‌ కర్నల్‌ మారిస్‌
విలియం బ్రౌన్‌ విలియంకెరీ
బెంజిమిన్‌ షుల్జ్‌

ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ రాబర్ట్‌ డొనొబిలి మెన్రీ మార్డిన్‌
మెన్రీ మార్డిన్‌ స్కడ్డర్‌

జార్జిక్రాస్‌ ఎ.డి. కాంబెల్‌
వంటి మహనీయుల నోళ్ళలో కీర్తిని పొందాను

కవిత్రయ క్యావ్యాలలో వెలుగొందానురా

శివ కవుల ఎదలో చిన్మయానందం పొందానురా

వ్యాకరణంతో మెప్పించాను
పాత్రోచిత భాషలోఒదిగానురా
వ్యావహారిక వాదిగా మారానురా

అభ్యుదయ వాదులతో ఉంటూ
దిగంబర కవులతో కలిసి
దిక్ లు పిక్కటిల్లేలా అరిచానురా

కృష్ణ శాస్త్రి భావ సుందరిలా
నండూరి ఎంకి పిల్లగా నాట్యమాయరంలా నర్తించానురా

పాలేరు నాటకంతో పని మాన్పించా
వారి బతుకుల్లో తెలుగు వెలుగులు వెలిగించానురా

సంఘ సంస్కరణలు చేపించానురా
స్త్రీవాదులచే స్త్రీ విద్యకై
ఉద్యమించానురా

సినారె చిలిపి పలుకుల రాగమాలికలా
వేటూరి సిరివెన్నెల చిరు జల్లుల్లో
వెండితెర వెలుగుల్లో వికశించానురా

ఘంటసాల గానామృతంలో
తడిసి ముద్దయ్యనురా

శైలజా సుశీలమ్మల మృదుమధుర గొంతులో
శ్రావ్యంగా పలికానురా

బాలూ మనో ల సుస్వరాల్లో తేలియాడనురా

అంతర్జాతీయ స్థాయిలో
మాతృభాషా మాధుర్యాన్ని పంచుతున్నానురా

ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ తెలుగుతల్లినైన నన్ను మర్చిపోతారా
ఆలోచించండి ఓ నా తెలుగు ప్రజలారా

తెలుగు వెలుగులు పూయించండి
మాతృభాషను పరిరక్షించండి…

                                                                                          -వెంకట్. కె

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to మాతృభాషను పరిరక్షించండి…(కవిత) -వెంకట్ .కె

  1. శ్రీనివాస్ says:

    మాతృభాష పై ప్రస్తుతం కావాల్సిన తీరును…. దాని కోసం మనం చేయాల్సిన పనులను తెలియజేసారు..
    ధన్యవాదాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)