అమ్మా తెలుగమ్మా(కవిత )-నాగరాజు .జి


తెలుగు భాష ప్రాముఖ్యత
మరుగున పడుతున్నందుకు ఆవేదన

అమ్మా తెలుగమ్మా
తరతరాల చరిత్ర గలదమ్మా
ఒంపుసొంపుల నుడికారాలు,
వ్రాసే కూర్పులో ఎన్నో వయ్యారాలు
తల్లి భాషవు కదమ్మా
నీ అక్షరాల పాలధారతో ఆకలి తీర్చిన దానివమ్మా
కాలం మారే కొలది మారు తల్లి వైనావమ్మా
నీ విలువ తగ్గించి బ్రతకాలన్నది నేటిలోకం
అసలు అమ్మలేనిదే పుట్టుక ఏదమ్మ?
పాశ్చాత్యులు నిన్ను ఎంతో పొగిడినారమ్మా
వారు నీ విలువ తెలిసి ప్రయోగాలు చేసినారమ్మా
నీ ప్రాచీనతను వారు గుర్తించారు
వేల వేల పద్యాలు సేకరించారు
నిన్ను జాగ్రత్తగా భద్రపరిచారు
ఈ లోకానికి నీ విలువ తెలియపరిచారు
కానీ,మేము నిన్ను మరిచాము
తెలుగును వదిలించుకోదలిచాము
పాశ్చాత్య భాష ప్రాణం అయింది
తల్లి భాష దూరమైంది
                                                           -నాగరాజు.జి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

3 Responses to అమ్మా తెలుగమ్మా(కవిత )-నాగరాజు .జి

  1. అమృత says:

    తెలుగు స్థితి..పరిస్థితి చాలా చక్కగా వివరించారు.. ధన్యవాదాలు…

  2. Vimala says:

    Mee kavitha chadivina naaku edupochindi Chala Baga rasaru

  3. శ్రీదేవి says:

    ప్రస్తుతం తెలుగు పరిస్థితిని బాగా చెప్పారు నాగరాజు గారు . మంచి కవిత .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)