ప్రేమంటే.. !!(కవిత )-రాజు నీల

పురిటినొప్పులతో ప్రసవ వేదనను భరిస్తూ…!

మరుజన్మనొంది ప్రపంచానికి నిన్ను పరిచయం చేసింది తల్లిప్రేమ…!!

ఏమీ తెలియని నీకు ప్రపంచమంటే ఏంటో…!

తెలియజేసిన భరోసా తండ్రి ప్రేమ…!!

తల్లిదండ్రుల వలే అనునిత్యం…!

నిన్ను అలరించి ఆదరించేదే తోబుట్టువుల ప్రేమ…!!

నువ్వెవరో నీకు తెలియజేసే జ్ఞానమే  గురువు ప్రేమ. !!

నీవెవరైనా, నీకంటూ నేనున్నాననే నమ్మకమే స్నేహమనే ప్రేమ…!!

ఒకరికొకరంటూ తోడునీడగా కడవరకూ నిలిచేదే ఆలుమగల ప్రేమ…!!

 “ప్రేమకి మూలమే అనుబంధం “

అది లేని ప్రేమ కి అర్ధమే లేదు.

ప్రేమామృతాన్ని ఒలికించే పరిమళ కుసుమాలు కలిగిన 

నందనవనమైన జీవితాన్ని ఆస్వాదించడం మరిచి…!

అనుక్షణం మారుతూ అవధులు లేని అవసరాలనే ఎడారిలో…

ఎలాంటి అనుబంధము లేని ఆకర్షణలనే ఎండమావులను ప్రేమనుకొని…!!

ముళ్ళపొదలలో తేనెలకై పరితపిస్తూ జీవన మాధుర్యాన్ని కోల్పోయే…!

యువతా తెలుసుకో.. !

ప్రేమంటే… ఏమిటో..??

                                                                                         -రాజు నీల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to ప్రేమంటే.. !!(కవిత )-రాజు నీల

  1. సుధ says:

    కేవలం ఆడ , మగ మధ్యలో ఉండేది మాత్రమే ప్రేమ కాదు. అన్ని బంధాలలో అనురాగం రూపంలో అల్లుకొని ఉండేదే ప్రేమంటే అని చాలా బాగా చెప్పారు. ఇప్పటి యువత కు జీవన మాధుర్యమేమిటో తెలుసుకోండి అంటూ ప్రశ్న నీ సంధించారు. బావుంది సర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)