కొత్తకోడలు(కవిత )-నవీన్ హోతా.

ఎర్రెర్రని పారాణి వెలుగుల్లో
కొత్త కాపురపు రుచులను
వండుకుంటుంది…
పుట్టింటి ప్రేమలను
తీపెక్కువైన చేదుగా
వదులుకుంటుంది…

మెడను చేరిన
పసుపుదారపు సాక్షిగా
అత్తింటి సూత్రాలకు
కట్టుబడుతుంది…
అమ్మా – నాన్న పలుకులకు
తెగదెంపులిస్తుంది…

మెరిసే మెట్టల మిలమిలల్లో
చేయి పట్టీ నడిపించిన నాన్న గుర్తులను
పాదాలపై మోసిన మమకారాలను
తప్పటడుగుల్ని చేసి
కట్టుకున్నవాడి అడుగులకు
మడుగులు వత్తే
పరుగు పందాన పాలుపంచుకుంటుంది…

బుగ్గచుక్కతో పుట్టింటికి దిష్టి తీసేసి
భాసికపు గుర్తుతో తోడబుట్టిన బంధాలకు బలవంతపు వీడ్కోలు ఇచ్చేసి
మూరెడు నమ్మకాన్ని మెడలో మోస్తుంది
గుప్పెడు తలంబ్రాల ఆశీస్సులు వెంటతెచ్చుకుంటుంది…

అత్తిల్లే తన ఇల్లై
ఎక్కడెక్కడి వారో ఇకపై తనవారై
ఇష్టాల కప్పి వేతలతో
బాధ్యతల పలకరింపులతో
కుడికాలుకు ముందుచూపు నేర్పించి
పాలన కలిసే తేనెలా
నింగిన మెరిసే చుక్కలా…
నిన్నటి దాకా ఆ ఇల్లు
ఇప్పుడు తన ఇల్లు అయిన చోట
అస్తిత్వపు యుద్ధానికి సన్నద్ధమౌతుంది….
గుర్తింపుల వేలం పాటకు
రాజీ పడుతుంది…
కోటి కోర్కెల
పసుపు బట్టల
#కొత్తకోడలు…
తనింటికి ఇప్పుడు
#పాత ఆడపడుచు…!!

                                                                    -నవీన్ హోతా.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)