జగమెరిగిన చీపురు
జనం మెచ్చిన చీపురు
పల్లెయందు చీపురు
పట్నమందు చీపురు
ఇల్లు వాకిలి లూడ్చునట్టి చీపురు
ఓట్లలన్నీ ఊడ్చే
సామాన్యుడి చీపురు
దుమ్ము దులిపి వేసెను
కషాయపురంగు కడిగెను
కొనేరును కదిపెను
కలువలన్నీ వాడెను
కనుమరుగై
కానరాక పోయెను
చెయ్యిద్దామంటే ‘చీ’పురని
చిన్న సూపు చూసెను
హస్త రేఖలు చేరిగెను
ఆశలన్నీ అడుగంటెను
అధికారం సామాన్యుడు చేపట్టిన చీపురుకస్థగతమయ్యెను
ముచ్చటగా మూడవసారి
మందీ మార్బలమంతా
మోహరించినా
పొర్క దెబ్బకు అష్టకష్టాలు పడి అశోకము తో నిలిచిరి
ఇదేకదా ప్రజా విజయం
ఇదేకదా సామాన్యుడి విజయకేతనం ప్రజాస్వామ్య విజయం
-వెంకట్ .కె
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~