ఉరి (కవిత )- గిరిప్రసాద్ చెలమల్లు

సమాజం ఉరితాళ్లపై

ఊగుతుంది

బాలికల నుండి కాటికి కాళ్ళు

చాపిన ముసలి దాకా

కులమూ లేదు

మతమూ లేదు

మానమంటూ అంగట్లో నరక్కబడుతుంది

ఎదుగుతున్న సంఘమంటూ

వీరంగం

బలాత్కారం వార్త లేని రోజు లేదు

పెట్టుబడి విషపుత్రికలైన

పత్రికల్లో సైతం

ఆలోచనల్లో మార్పు లేదు

చూపుల్లో కోణం

కోరికలే కళ్లల్లో

చేతల్లో

వ్రాతల్లో అదే దృక్పధం

రోజురోజుకి పెరుగుతున్న వార్తలు

అన్నీ ఉరిత్రాళ్ళు వేలాడట్లే

రచ్చబండ క్రింద వేలాలెన్నో

వెలయాలులుగా మార్చబడేవెన్నో

గత్యంతరం లేని వాడల్లో దూలాలకు వేలాడేవెన్నో

ప్రశ్న పెగలదు వాడల్లో

వీధుల్లో

పాకల్లో పొలాల్లో

నిచ్చెన మెట్ల దాష్టీకంలో

కూసేవాడు హక్కుగా

ఎన్నెన్నో శిబిరాల్లో

ఆశ్రమాల బోర్డుల వేలాడతీతలో

వెలగబెట్టే కార్యాలెన్నో పొక్కవ్

పొక్కినా కోర్టుమెట్ల పై ఏళ్ళ తరబడి

అదే మానం

నగర మానం

పల్లె మానం

అగ్ర మానం

నిమ్న మానం లుగా విడగొడుతూ

తెగ్గొడుతూ సంఘాన్నే ఉరికొయ్యకి వేలాడదీస్తున్న వైనం

శిక్ష సత్వరం

ఉపశమనం

ఆత్మ సంతృప్తి

శాంతించే సమాజం

ఔరా ! ఔరత్ కీ ఇజ్జత్

ఇగురమే లేని వ్యవస్థలో పరిహసింపు

సమస్య ఛేదనం మరచి

శిర ఛేదనం అంగఛేదనమంటూ కదిలే జనం

ఏలికల గిమ్మిక్స్ లో

జనం ఊయలూగు

ఊహల్లో

తెరవెనుక ఎన్నెన్నో భాగోతాలు

వెలుగులోకి రానివేన్నో

త్రిభుజం లోని

అన్ని కోణాలూ భుజాలూ సమం కావూ

అడపాదడపా ఉరికొయ్యలూగుతాయంతే

హేళనగా  శీర్షం కేంద్రకంగా

– గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to ఉరి (కవిత )- గిరిప్రసాద్ చెలమల్లు

  1. ఆనంద్ says:

    గిరి గారు మీ ఉరి కవిత చాలా బాగుంది..
    వాస్తవలకి అక్షర రూపం మీ కవిత…
    ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)