తులనాత్మక  సాహిత్య విమర్శ ,స్త్రీ వాద రచయిత్రి –పద్మభూషణ్ గాయత్రి చక్రవర్తి స్పివాక్ -గబ్బిట దుర్గాప్రసాద్

స్పివాక్ గాయత్రి చక్రవర్తి కలకత్తాలో పరేష్ చంద్ర చక్రవర్తి ,శివాని చక్రవర్తి లకు 24-2-1942 జన్మించింది .తాతగారు ప్రతాప చంద్ర మజుందార్ శ్రీ రామకృష్ణ పరమహంస కు డాక్టర్ .తండ్రి శారదామాత చేత ,తల్లి స్వామి శివానంద చేత దీక్ష పొందారు .సెకండరి విద్య సెయింట్ జాన్ దయో సేసన్ హయ్యర్ సెకండరి స్కూల్ లో చదివి ,కలకత్తా యూనివర్సిటి లోని  ప్రెసి డెన్సికాలేజి లో నుంచి  1959లో డిగ్రీ పొందింది .

   1961లో అమెరికాలోని కార్నెల్ యూని వర్సిటి లో’’ జీవిత తనఖా’’ పై అప్పుతీసుకొని వెళ్లి ఇంగ్లిష్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం లో చేరింది .ఇంగ్లిష్ శాఖనుంచి ఆర్ధికసాయం అందకపోవటం తో ,అక్కడే కొత్తగా ప్రవేశపెట్టబడిన మొదటి డైరెక్టర్ ,గైడ్ అయిన పాల్ డీ మాన్ ఆద్వర్యం లోని ‘’కంపారటివ్ లిటరేచర్ ‘’కు మారింది .అప్పటికి ఆమెకు ఫ్రెంచ్ .జర్మన్ భాషలలో  తగినంత అనుభవం లేదు .పాల్ మార్గ ,సలహా ,దర్శకత్వం లో డబ్లు .బి .యేట్స్ కవిత్వం పై ‘’  మై సెల్ఫ్ మస్ట్ ఐ రీమేక్-ది లైఫ్ అండ్ పోయెట్రిఆఫ్  డబ్లు .బి .యేట్స్’’అంశంపై పరిశోధనాపత్రం రాసింది .1959 గ్రాడ్యుయేషన్ అయ్యాక ,వెంటనే ఇంగ్లిష్ ట్యూటర్ గా వారానికి 40గంటల పనికి చేరింది .ఎం.ఏ.లో ఆమె థీసేస్ ‘’ది రిప్ర జంటేషన్ఆఫ్ ఇన్నోసేన్స్ ఇన్ వర్డ్స్ వర్త్ విత్ ఎం.హెచ్ .అబ్రాం ‘’.1963-64లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటి  గర్టన్ కాలేజి లో రిసెర్చ్ స్టూడెంట్ గా చేరింది .ఆమె ప్రొఫెసర్ టి.ఆర్. హెన్ .పర్య వేక్షణలో విలియం బట్లర్ యేట్స్ కవిత్వం లోని  లిరిక్ లో వివిధ దశలలో వచ్చిన అభి వృద్ధిపై వ్యాసపరంపర రాసింది .1963 సమ్మర్ లో ‘’యేట్స్ అండ్ ది థీమ్ ఆఫ్ డెత్ ‘’అంశంపై కోర్స్ ప్రోగ్రాం ను ఆయన స్వదేశం ఐర్లాండ్ లో స్లిగో లోని యేట్స్ సమ్మర్ స్కూల్ లో  నిర్వహించింది .

    1965ఫాల్ లో స్పివోక్ అయోవా యూనివర్సిటి ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ లో  అసిస్టెంట్  ప్రొఫెసర్ గా చేరింది .1970లో పదవీకాలం పూర్తయి౦ది కాని తన  డేజెర్టేషన్  ను ప్రచురించలేక పోయింది  .అయినా  అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధులకు ఉపయోగకరంగా యేట్స్ కవి పై విశ్లేషణాత్మక పుస్తకం రాయాలనిపించి మొదటిపుస్తకంగా ‘’మై సెల్ఫ్ ఐమస్ట్ రీమేక్-ది లైఫ్ అండ్ పోయెట్రి ఆఫ్ డబ్లు.బి .యేట్స్ ‘’రాసి ప్రచురించింది .ఎప్పటిప్పుడు తననుతాను అభి వృద్ధిచేసుకొనే కృషిలో ఉండగా అకస్మాత్తుగా ఒక అజ్ఞాత రచయిత రాసిన ‘’డీ లా గ్రామటాలజి’’పుస్తకం కొన్నది .దీన్ని చదివి ప్రేరణపొంది వెంటనే పెద్ద ‘’అనువాదకుని ఉపోద్ఘాతం’’రాసి  దాన్ని అనువాదం చేసి ప్రచురిస్తే మంచి విజయం లభించింది.ప్రపంచమంతా ఆ ఉపోద్ఘాతానికి జేజేలు పలికింది .జాక్వెస్ జేర్రిడా రాసిన’’ఫిలాసఫీ ఆఫ్ డీ కన్స్ట్రక్షన్ ‘’కు ముందుమాటగా ఆమె ఉపోద్ఘాతం చేర్చాడు .ఆయనను ఈమె 1971లో మొదటి సారి కలిసింది .

   1974లో అయోవా యూనివర్సిటి లో కంపారటివ్ లిటరేచర్  శాఖలో లో అనువాదం లో ఎం.ఎఫ్.ఎ.స్థాపించింది .మరుసటి ఏడాది ఆమెయే పూర్తి ప్రొఫెసర్ షిప్  తో ఆ ప్రోగ్రాం డైరెక్టర్ అయింది.ఆమె ప్రతిభ బాగా వ్యాపించి 1978లో చికాగో యూనివర్సిటిలో నేషనల్ హ్యుమానిటీస్ ప్రొఫెసర్ అయింది .తర్వాత చాలా విజిటింగ్ ప్రొఫెసర్ షిప్ లు ,ఫెలోషిప్ లు అందుకొన్నది .వెంటనే 1978లోనే  ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటి ఇంగ్లిష్ అండ్ కంపారటివ్ లిటరేచర్ డిపార్ట్ మెంట్ లోఇంగ్లిష్ ప్రొఫెసర్ గా చేరింది.1982లో ఎమరీ యూనివర్సిటి లో లాంగ్ స్ట్రీట్ ప్రొఫెసర్ అయింది .1986లో పిట్స్ బర్గ్ యూని వర్సిటి మొదటి మేల్లాన్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లిష్ పదివి చేబట్టింది .ఇక్కడే ‘’కల్చరల్ స్టడీస్ ప్రోగ్రాం ‘’ప్రారంభించింది .కొలంబియా యూనివర్సిటి ఫాకల్టి మెంబర్ అయి,హ్యుమానిటీస్ లో ఎవియాన్ ఫౌండేషన్ ప్రొఫెసర్ అయింది .2007యూనివర్సిటి ప్రొఫెసర్ ఇన్ హ్యుమానిటీస్ అయి చదువులతల్లిగా గుర్తి౦పు పొందింది.1964లో టాల్బోట్ స్పివాక్ అనే కలకత్తా యూనివర్సిటి సహ విద్యార్ధిని పెళ్ళాడి, 77లో విడాకులిచ్చి ,తర్వాత ఢిల్లీ యూనివర్సిటి హిస్టరీ ప్రొఫెసర్ వాసుదేవ చటర్జీ ను పెళ్లి చేసుకొని ,పదేళ్ళ తర్వాత విడాకులిచ్చింది.

  డిఫరెన్సెస్,సైన్స్ –జర్నల్ ఆఫ్ వుమెన్ ఇన్ కల్చర్ అండ్  సొసైటీ ,డయాస్పోరా –ఎ జర్నల్ ఆఫ్ ట్రాన్స్ లేషనల్  స్టడీస్ వంటి ప్రముఖ జర్నల్స్ కు సలహాదారుగా స్పివోక్ ఉన్నది .జెర్రిడా రచనకు చేసిన అనువాదమేకాక బెంగాలీ నవలా రచయిత్రి మహాశ్వేత నవలలు ,18వ శతాబ్ది బెంగాలికవి రాంప్రసాద్ సేన్ కవిత్వాలను ఆంగ్లీకరి౦చిమ్ది   .ఆ మధ్యనేరచయిత ,స్టేట్స్ మన్ మార్టినిక్ కు చెందిన  ఐమీ సేసారే రాసిన ‘’ఎ సీజన్ ఇన్ కాంగో ‘’ను ఆంగ్లం లోకిఅనువాదం చేసింది .1997లో కేంద్ర సాహిత్యఅకాడెమి పురస్కారం పొందింది .2013లో భారత ప్రభుత్వం ‘’పద్మభూషణ్ ‘’పురస్కారం అందించి గౌరవించి సత్కరించింది .

   స్పివోక్ 1983లో రాసిన  ‘’కన్ ది సబాల్టరన్ స్పీక్? ‘’వ్యాసం స్త్రీలను  చరిత్ర ,భూగోళం ,వర్గీకరణ దృష్టితో చూసే  స్త్రీవాద రచయిత స్థాయి తెచ్చింది.’’సబాల్టరన్ ‘’అనే పదాన్ని పౌరసత్వ అర్హత లేని సమాజవర్గాన్ని ఉద్దేశించి ‘’యాంటోనియో గ్రామ స్కి  వాడిన పదం .అది ఇప్పుడుస్త్రీజాతికి వర్తిస్తోంది .ఈ వ్యవస్థ ఆలోచనలో పూర్తి విప్లవాత్మకమైన మార్పు రావాలని స్పివోక్ ఆరాట పడింది .1980లలో ఆమె ‘’పోస్ట్ కలోనియల్ థీరీ ‘’స్థాపకుల్లో ఒకరు .తనభావాలను ‘’ఎ క్రిటిక్ ఆఫ్ పోస్ట్   కలోనియల్ రీయన్ –టువార్డ్స్ఎ హిస్టరీ ఆఫ్ వానిషింగ్ ప్రెజెంట్ ‘’1999లో రాసింది .ఇతర రచనలు –ఇన్ అదర్ వరల్డ్స్ ,అవుట్ సైడ్ ది టీచింగ్ మెషిన్ ,డెత్ ఆఫ్ డిసిప్లిన్ ,అదర్ ఏశియాస్ ,యాన్ ఏస్తేటిక్ ఎడ్యుకేషన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్.మొత్త౦ 12పుస్తకాలు విద్యా  సంబంధంగా,ఇమేజరిమాప్స్ ,బ్రెస్ట్ స్టోరీస్ ,ఓల్డ్ వుమన్ ,సాంగ్ ఫర్ కాళి,చోటి ముండాఅండ్ హిజ్ ఆరో ,రెడ్ త్రెడ్ సాహిత్యపరంగా  రాసింది

  1986నుండి వెస్ట్ బెంగాల్ బీహార్ ,జార్ఖండ్ రాష్ట్రాలసరిహద్దులలో భూమిలేని చదువురాని యువత కోసం బోధనా ,ట్రెయినింగ్ కోర్సులు నిర్వహిస్తోంది .ప్రపంచీకరణలో వచ్చిన చెడు అనుభవాలు ఆమెకు బాగా అర్ధమయ్యాయి .1997లో ఆమె స్నేహితుడు ,ధర్డ్ రీచ్ వారసుడు లోరె మేడ్జేర్ 10,000డాలర్ల నిధిని  గ్రామీణ విద్యా వ్యాప్తికి ఆమెకు సమర్పించాడు .దీనితో గ్రామీణ విద్యా వ్యాప్తికోసం ఆమె తన తలిదండ్రులు’’ పరేష్ చంద్ర శివానీ చక్రవర్తి మెమోరియల్ ఫౌండేషన్ ‘’స్థాపించి సేవలుకొనసాగిస్తోంది .

    సాంఘిక సేవారంగం లో స్పివోక్ చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించి టోరెంటోయూనివర్సిటి ,లండన్ యూనివర్సిటి ,ఒబెర్లిన్ కాలేజ్ ,యూనివర్సిటాట్ రోవిరా వర్జిల్,రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం ,యూనివర్సి డా నేషనల్  డీసాన్ మార్టిన్ ,యూనివర్సిటి ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ,యూని వర్సైట్ డీ విన్సేన్స్ ఆ సెయింట్ డెనిస్ ,ప్రెసిడెన్సి యూని వర్సిటి ,ఏల్ యూనివర్సిటి యూనివర్సిటిఆఫ్ ఘన –లేగాన్ మొదలైనవి గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించాయి .ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ విభాగం లో స్పివోక్ ‘’క్యోటోప్రిజ్ ఇన్  ఆర్ట్స్అండ్ ఫిలాసఫీ పొందిన ఏకైక మహిళగా రికార్డ్ సాధించింది . విద్య ,సేవ ,మహిళాభివృద్ధి హక్కులు ,తులనాత్మక సాహిత్యం ,సమాజ సేవ లలో గాయత్రి చక్రవర్తి స్పివాక్ తనదైనముద్ర వేసింది .

   -గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో