అచ్చంఅమ్మలాగే(కవిత )-డా. కరుణశ్రీ,

అచ్చంఅమ్మలాగే
కాళ్ళుపట్టుకున్నాకనికరించనికళ్ళు
మొరపెట్టుకున్నా మాట్లాడని మౌనాలు
ప్రాధేయపడ్డా ఒప్పించలేని పంతాలు
ఎన్ని అవమానాలు?
ఎన్ని తిరస్కారాలు?
నేనొద్దన్నపనిఎన్నడూ చేయని అమ్మానాన్నలు
ప్రేమించాననగానే చెవిటి వాళ్ళయ్యి,
గొంతు చించుకుంటున్నామూగవాళ్ళయ్యి,
నా చేయి విడిచి పెట్టినప్పుడు,
తట్టుకోలేక నా కాళ్ళు గడప దాటాయి.
ఆయన చెయ్యి పట్టుకుని
మరో గృహ ప్రవేశం చేశాయి.
ప్రేమలన్నీప్రాణాలు పొయ్యవనీ
పగలన్నీప్రాణాలు తియ్యవనీ
కాలంతో సహాజీవితంలో అన్నీ
మారతాయనీ తెలుసుకునే సరికి
ఎదురుగా ఎదిగిన పిల్లలు-
వాళ్ల నిర్ణయాల్ని గౌరవించమంటూ
జారీచేసే ఆజ్ఞలు-
అమ్మనైన ఇన్నేళ్ళకు,
అమ్మతనం బిడ్డలను
కాపాడలేదేమోనని బెంగపడ్డప్పుడు,
నాకు నేను అచ్చం

మాఅమ్మలానేఉన్నా!

డా. కరుణశ్రీ,
సహాయ ఆచార్యులు,
డి.కె.ప్రభుత్వ మహిళా కళాశాల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)