జ్ఞాపకం-46 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

Anguluri Anjani devi

వాళ్లు రాఘవరాయుడుతో మాట్లాడినా సంలేఖను గమనిస్తూనే వున్నారు. సంలేఖ వాళ్ల మాటల్ని వింటుందో లేదో కాని వాళ్ల వైపైతే అప్పుడప్పుడు చూస్తోంది.
“చూడు సంలేఖా! మనిషికి జీవితం ముఖ్యం! దాన్ని తీర్చిదిద్దు కోవటానికే ఈ చదువు. పర్సనాలిటీ డెవలప్ మెంట్ అనేది ఇప్పటినుండే అవసరం. లేకుంటే సక్సెస్ రాదు. చిన్న చిన్న విషయాలు పెద్దవి చేసి ఆలోచించడం ఈ వయసులో మీకు సహజమే! అలా అని ఒకే విషయాన్ని వదలకుండా పట్టుకోకూడదు. ఎందుకంటే ఈ రోజు రేపటికి నిన్నయిపోతుంది. ఈ రోజుకి వున్న ప్రాధాన్యత నిన్నకి వుండక పోవచ్చు. అలాగే లైఫ్ లో ఎన్నో సంఘటనలు, ఎందరో వ్యక్తులు తారసపడుతుంటారు. కెరీర్ కి తప్ప దేనికీ ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. బాగా చదువు. నీకు మంచి భవిష్యత్తు వుంటుంది” అన్నారు.
ఆమె మౌనంగా చూసింది.

“నీకిప్పుడు మేమిలా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఎందుకనుకున్నామో తెలుసా! ఒక వజ్రం రాయిలా మారకూడదని. అంతే కాదు. మాకు తెలిసి చాలా మంది పిల్లలు తాగుబోతులైన, జూదగాళ్లయిన తండ్రుల పాదాల కింద నలిగిపోతున్నారు. ఎవరో దాతలు ముందుకొస్తేనే తప్ప వాళ్లకి చదువుకునే అవకాశం లేదు. ఆ తండ్రులకి బాధ్యత లేదు. అలాంటిది రాఘవరాయుడు లాంటి మంచి తండ్రి తను వూహించిన రీతిలో పిల్లల్ని చూసుకోలేక రోదించకూడదు. అదీకాక నువ్వు ఎప్పటిలాగే చదివితే నువ్వు సాధించబోయే ర్యాంక్ మా కాలేజీతో పాటు నీ తల్లి, దండ్రులకి కూడా గుర్తింపు తెస్తుంది. సి.ఎ.లో సీటొస్తుంది. అది పూర్తయ్యాక నువ్వు మంచి కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్ గా వెళ్లిపోతావు. ఇప్పుడు మీ కుటుంబం ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు అప్పుడు వుండవు. సమాజంలో కీర్తి కూడా పెరుగుతుంది. అది గుర్తుంచుకొని చదువుకో !” అన్నారు.

వాళ్లు మాట్లాడుతున్న ఒక్క మాట కూడా ఆమె మనసులోకి వెళ్లడం లేదు. చలనం కలిగించడం లేదు. ఒక వైపు ఇంకా పసితనం వీడని తత్వం. ఇంకో వైపు అంతా తెలుసు ఇంకేం మిగల్లేదు నాకు అన్ననిరాశ. ప్రపంచం లో వున్నవాళ్లందరి కన్నా తన ఒక్కదానికే సూన్యం మిగిలినట్లు. మానసికంగా కోలుకోలేని దెబ్బ తగిలినట్లు భావరహితంగా చూస్తోంది.

వాళ్ళు ఆమెను గమనించకుండా రాఘవరాయుడుతో ”మీరు సంలేఖను హాస్టల్లో వుంచి వెళ్ళండి. చదువుకుంటుంది” అన్నారు.
వాళ్ళ వైపే ఆలోచనగా చూస్తున్నాడు రాఘవరాయుడు.

ఈమధ్యన ఆ కాలేజీలో కౌన్సిలింగ్ తీసుకునే పిల్లలు ఎక్కువయ్యారు. కారణాలు చిన్నవా, పెద్దవా అన్నది చూడకుండా విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

అబ్బాయిల్లో కూడా ఈ ఒత్తిడి అధికంగానే వుంది. అవతల వాళ్ల స్వభావాలను తెలుసుకోకుండా స్నేహాలు చెయ్యటం. వాళ్లలో వున్న చెడు లక్షణాలను అంటించుకోవడం. వాటి నుండి బయటకి రాలేక పోవడం. ఈ మధ్యన తిలక్ అలాంటి స్నేహాలకు బాగా దగ్గరయ్యాడు. అది తెలిసి రాఘవరాయుడు అందోళనతో “నువ్వు చేస్తున్న స్నేహాలు నీ వయసుకి తగినవి కావురా? నీ క్లాసు వాళ్లతో కాకుండా బయట పిల్లలతో నీకు స్నేహమేంటి ? ఇలాంటి స్నేహాలు నిప్పురా! ఆ నిప్పు చల్లారి బొగ్గుగా మారాక కూడా మసి అంటుకుంటుంది” అని చెప్పేవాడు. ఎంత చెప్పినా వినకుండా క్లాసులకి సరిగా వెళ్లకపోవడం, వెనక బెంచీలో కూర్చుని అల్లరి చెయ్యటం లాంటివి చేస్తుంటాడు.

ఇవన్నీ సక్రమమైన ప్రవర్తన లేని వాళ్లతో స్నేహం చెయ్యటం వల్లనే వస్తాయి. చెడ్డ వాళ్లెప్పుడైనా వాళ్ల బలం పెరగటం కోసం ఎలాంటి వాళ్లనైనా తమలాగే మార్చుకుంటారు. అలాంటి వాళ్లతో స్నేహం చెయ్యకురా! ఒక్కసారి చెడ్డవారితో కలసి తిరగడం మొదలు పెట్టాక మధ్యలో మంచి వాళ్లుగా మారి వాళ్లకి దూరం కావాలన్నా కానివ్వరు. అలా అయినా కూడా ఏ దొంగతనమో, తగాదానో, అల్లరిపనో చేసి ఇరికిస్తారు’ అని చెప్పినా దులిపేసుకొని వెళ్తుంటాడు. రాఘవరాయుడే కాదు. ఆ కుటుంబం హితవు కోరే భరద్వాజ మాష్టారు కూడా తిలక్ కన్పించినప్పుడల్లా జీవితానికి పనికొచ్చే జీవిత సత్యాలను చెబుతూనే వుంటాడు. ఈ పిచ్చోళ్లకి ఏం తెలుసు తను చేస్తున్న స్నేహంలో వున్న మజా అన్నట్లు ఓ నవ్వు నవ్వి వెళ్లిపోతుంటాడు. పెద్ద వాళ్ల దృష్టిలో, లెక్చరర్ల మాటల్లో తిలక్ ఎలా వున్నా కాలేజీలో అల్లరి గ్యాంగ్ కి కింగ్ లా అన్పిస్తుంటాడు. ఎలాంటి అకేషన్స్ లోనైనా తిలకే ముందుంటాడు. వయసులో పెద్దవాడు అయినందువల్లనో ఏమో ఆ క్లాసు వాల్లందరి కన్నా దూకుడుగా అన్పిస్తాడు. .

అది గుర్తొచ్చి “సరే సార్ సంలేఖను ఇక్కడే వుంచి వెళతాను” అంటూ నెమ్మదిగా లేచి ఆయన ఆ గదిలోంచి కూతురుతో పాటు బయటకొచ్చాడు.
సంలేఖకి ఇక్కడే వుండి జయంత్ ముఖం చూడాలని లేదు. గుర్తు చేసుకోవాలన్నా కష్టంగా వుంది. మనసుని రంపంతో పరపర కోసి నట్లనిపిస్తోంది.
అందుకే ”నేనిక్కడ వుండను నాన్నా! ఇంటికొస్తాను” అంది.

ఆయన వినలేదు. ఒక రకంగా నవ్వి “ఇంటికొచ్చి ఏం చేస్తావమ్మా ? పేడ పిసికి పిడకలు చేస్తావా? పొలం వచ్చి నుసాలు తొక్కుతావా? వరి నాటతావా? పత్తి చేనుకి నీళ్లు కడతావా? ఏం చేస్తావు? వంట చెయ్యటానికి మీ అమ్మ వుందిగా! ఎంత చెప్పినా అర్థం చేసుకోవా?” అన్నాడు. ఆయన గొంతులో కోపం లేదు. అర్థింపు, అలసట వుంది.

తండ్రి చెప్పేవన్నీ నిజాలే. ప్రస్తుతం తను చెయ్యటానికి వేరే పనులే లేవు. చదువు తప్ప. ఆ చదువు వల్లనే లెక్చరర్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర గుర్తింపు పొందింది.

(ఇంకా వుంది )

 

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

జ్ఞాపకం-45 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో