పెద్దింటి అశోక్ కుమార్ కథల్లో “మానవీయత” (సాహిత్య వ్యాసం )-చల్లా దేవి

ISSN -2278 -428 

మనిషి ఒక సంఘ జీవి .సంఘలోను , చుట్టూ ఉన్న మనుషులతోనే మనిషి జీవించ గలడు . కానీ తమ స్వార్ధాల కోసం ఎదుటి వ్యక్తిని మోసం చేయడం అనేది నేటి కాలంలో సర్వ సాధారణ విషయం . కానీ ఎదుటి వ్యక్తికి ఆపద కలిగినప్పుడు , కష్టం వచ్చినప్పుడు మనం చేయదగిన సాయం చేయడమే మానవత్వం అనిపించు కుంటుంది . అది లేని నాడు మనిషికి జంతువుకి మధ్య వ్యత్యాసం ఉండదు . అసలు ఈ సృష్టిలో మనిషిని యితర ప్రాణుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టేది ఆలోచనతో పాటు మానవత్వం కూడా అనడంతో సందేహం లేదు . అటువంటి మానవీయతను చాటే కథాంశాలు పెద్దింటి అశోక్  కుమార్ రచించిన కథలలో ఉన్నాయి.పెద్దింటి అశోక్ కుమార్ తెలంగాణ పల్లె ప్రజల జీవన స్థితులను , వారి వ్యధలను వస్తువుగా తీసుకుని రచనలు చేస్తున్న రచయిత . వీరు ఊట బాయి , వలస బతుకులు , మాయి ముంత , మా వూరి బాగోతం , జుమ్మే కి రాత్ మే , భూమడు వంటి ఆరు కథా సంపుటాలన, నవలలు , వ్యాసాలూ రచించారు . ఎన్నో పురస్కారాలు , అవార్డు లు అందుకున్నారు .  

“భూమాడు” కథా సంపుటిలో భూమాడు కథలో   ఎవరు లేకుండా అనాధగా తిరుగుతున్న భూమడు పిల్లాడిని తన వోటల్ లో పని ఇచ్చి ఉండమని చెబుతాడు . వాడికి తిండి పెడతాడు . కాని భూమడు ఈ మధ్య చెడు అలవాట్లు నేర్చుకుని మాట వినకుండా ఊరి పట్టుకుని తిరుగుతున్నాడు . గత రెండు రోజుల నుంచి భూమడు జాడ తెలియలేదు . ఎక్కడ ఉన్నాడో , ఏం తిన్నాడో ఎలా ఉన్నాడో అని రాములు భూమడు గురించి కంగారు పడుతుంటాడు . తన వోటల్ కి వచ్చిన అందరిని భూమడు గురించి అడుగుతాడు . ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతారు . ఒక చోట ఉన్నాడని ఎవరో చెప్పడంతో వెళ్లి తీసుకు రావాలని అనుకుంటాడు . కాని వోటల్ లో ఎవరో ఒకరు ఉండాలి అని ఆలోచిస్తాడు . ఇంతలో టీ కి చక్కర అయిపోవడంతో ఆ వంక పెట్టుకుని భార్యని వోటల్ చూడమని చెప్పి భూమడు కోసమా వెళ్తాడు రాములు .

“రెండు గిలాసలు నిండా చాయి పోసి యిచ్చిండు రాములు .బురద చేతులతో వణుక్కుంతూనే తాగిండు భూమడు .రాములు కండ్ల పొంత నీళ్ళు కారుతనే ఉన్నయి .ఏడుపు ఎత్తేసుకుంది .భూమాన్ని గ్దగ్గారికి తీసుకుని ఎంత పాపపు రాతరా భూమా నీది ..తల్లిని గుర్తువడితివి …ఏడవకపోతివి “అన్నడు.

 “ఎజెండా” కథలో శిల్ప స్కూల్ టీచర్ , భర్త రాజకీయాల్లో చురుకుగా ఉంటాడు . స్కూల్ లో కూడా శిల్ప తో మాట్లాడటానికి మిగిలిన టీచర్స్ కంగారు పడతారు . ఆమె ఏం ఉన్నా మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది . హిందూ ముస్లిం లను వేరు చేసి మాట్లాడటం శిల్ప కి నచ్చదు . స్కూల్ లోని సర్ బాబ్రీ మసీద్ గొడవల గురించి మాట్లాడితే వేరు చేసి మాట్లాడటం ఒప్పుకోదు . మనం భారతీయులం . అందరిదీ ఒకటే కులం ,ఒకటే మతం . అందరిలోనూ  మానవత్వం ఉండాలి .అదే పిల్లలకి పాఠాలుగా చెబుతుంది శిల్ప . భర్త హిందూ , ముస్లిం మతాలను  అడ్డు పెట్టకుని చేస్తున్న అరాచ రాజకీయ ఎత్తులకు నిలదీస్తుంది . వాటి తన సహాయం ఉండని చెబుతుంది .

“రక్తం మరకలున్న వంద” నోట్లు కథలోమమత , గంగరాజు భార్యాభర్తలు . వీరికి వ్యవసాయం లో నష్టం రావడం వలన కూలికి వెళ్తూ ఉంటాడు గంగరాజు . ఒక రోజు అనుకోకుండా దూరపు బంధువు కేశవులు మమత ఇంటికి వస్తాహాడు . తాను ఎడ్ల మారుబెరం చేస్తున్నాను . బాగా సంపాదించాను . యిప్పుడు రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను అని చెబుతాడు . ఈ ఊరిలో ఎడ్ల మారు బేరం ఉంది వచ్చాను అంటాడు . ఆ మాటలకి మమత కి తన భర్త కూడా ఎడ్ల మారు బేరం చేస్తే బాగుంటుంది అనుకుని భర్తకి చెబుతుంది . కేశవులు ఎడ్లను తీసుకుని డబ్బులు తీసుకోవడం మరిచిపోయానని గంగరాజు వద్ద నాలుగు వందలు తీసుకుని అతనికి ఇస్తాడు . మిగిలిన డబ్బులకి గంగరాజుని హామీగా చూపిస్తాడు . కొన్ని రోజులకి ఎడ్లను అమ్మిన వ్యక్తి వచ్చి గంగరాజుతో గొడవ పడతాడు . గంగరాజు ని కేశవులు మోసం చేసాడని తెలుసుకుని వాళ్ళ ఊరు వెళ్లి ఎడ్ల ను తీసుకు వచ్చేస్తాడు గంగరాజు .చివరికి కేశవుల యద్దుని కూడదా దాచి ఉంచుతాడు . డబ్బు ఇచ్చి  తీసుకు వెళ్ళమని చెబుతాడు .  వెయ్యి రూపాయలు ఇచ్చి కేశవులు ఎద్దుని తీసుకు వెళ్ళాడు .

“గంగరాజు గుండె బటువు ఎక్కింది . అంత కంటే బరువుగా చూసింది మమత .తర్వాత మమతానే మీదు మీద మీదనే తిరుగతడు . దాని చేతులల్ల పురుగుల పడచ్చు . వాళ్ళ సొమ్ము మనకెందుకు ?”అన్నది బాధతో .గంగరాజు సైకిల్ వేసుకుని వెళ్లి కేశవులకి ఆ వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చేసాడు . ఎవరి డబ్బులు తమ అన్యాయంగా వద్దని తమా మానవత్వాన్ని చాటుకున్నారు . 

“వలస బతుకులు” కథా సంపుటిలో “మోసగాడు ” కథలో ఊరిలో నలుగురు మస్కట్ వెళ్లి డబ్బు సంపాదిస్తూన్నారని , యిక్కడ వ్యవసాయం చేస్తే తిండికి బట్టకి కూడా చాలవని , రేపు పిల్లల చదువులు , పెళ్ళిళ్ళు ఎలా చేయాలని గొడవ చేస్తుంది . అడ్డుకని నర్సింలు మస్కట్ వెళ్లాలని అనుకుంటాడు . ఊరిలో ఉన్న రాజు నర్సింలుకి దగ్గర బంధువు కూడా డబ్బులు తీసుకుని విసా సంపాదించి మస్కట్ పంపుతూ ఉంటాడు . రాజు కి పొలం లో కొంత ఆమ్మి డబ్బులు కడతాడు . నెలరోజులు గడుస్తుంది . రేపు  మాపు అంటూ కొన్ని నెలలుగా రాజు నర్సింలుకి అదే మాట చెబుతూ ఉంటాడు .  చివరికి నర్సింలు లానే ఊరిలో మరి కొంత అమంది డబ్బులు కట్టి మోస పోయామని తెలుసుకుని బాధపడతారు . రాజు ఊరిలోకి రాగానే పట్టుకోవలాని అందరూ అనుకుంటారు . రాజు ఊరిలోకి రాగానే పంచాయితీ పెడతారు . చివరికి రాజు కొట్టాలని రాజు తరుముతూ ఉంటారు . రాజు నర్సింలు ఇంటికి వచ్చి దాక్కుంటాడు . అది చూసిన నర్సింలు భార్య …..

“వీడిని  వాళ్లకు అప్పగించండి . నమ్మించి మోసం చేసాడు . మన బతుకును ఆగం చేసాడు . మానను అప్పుల పాలు చేసాడు అంటుంది లక్ష్మి . దానికి నర్సింలు దెబ్బ తిన్న రైతులు ఆవేశంగా ఉన్నారు . వీడు దొరికితే చంపేస్తారు . ఆవేశం , ఆవేదన్ వారి చేత ఏదైనా చేయిస్తుంది . వీడి చస్తే బాకీలు  తీరతాయా ఆలోచించు అంటాడు భార్యతో నర్సింలు . ఆ రోజు రాత్రి రాజుని బొంబాయి వెళ్ళే బస్ ఎక్కించి వస్తాడు నర్సింలు .”

జుమ్మేకి రాత్ మే కథా సంపుటిలో” జుమ్మేకి రాత్ మే” కథలో సలీం తన చెల్లెలు హసీనా ని మోసం చేసిన శంకర్ కోసం దుబాయి అంతా వెతుకుతూ ఉంటాడు. శంకర్ కనిపిస్తే వాడిని చంపి పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు . శంకర్ వాళ్ళ సలీం చెల్లెలు హసీనా చనిపోయింది . చివరికి సలీం కి శంకర్ పట్టుబడతాడు . చివరి నిమిషం వరకు సలీం శంకర్ని చంపాలని ప్రయత్నిస్తాడు . కానీ చివరి నిమిషాలో సలీం లోని మానవత్వం శంకర్ ప్రాణాలను కాపాడుతుంది .

“అల్లా ఎవరికి ఎలా జరగాలో అలా రాసి పెడతాడు . మన చేతుల్లో ఏముంది ..?హసీనాకు అంతే బతుకు రాసినట్టున్నాడు . వాడైనా నేనైనా నిమిత్త మాత్రులమే కదా అనుకున్నాడు .అలా అనుకుంటే గుండె బరువు తగ్గింది .”  అంటూ బటన్ నొక్కి క్రేన్ ని కిందికి వంచాడు . అందులోంచి కింద బడ్డ శంకర్ అక్కడ నుంచి పారిపోయాడు .  చివరి వరకు తా చెల్లెళ్ళు హసీనాని మోసం చేసిన శంకర్ పై ఆగ తీర్చుకోవాలి అనుకున్న  సలీం లోని మానవత్వం కనిపిస్తుంది. 

 “వలయం” కథలో సి.ఐ రాజు తండాల్లో జరుగుతున్న సారా వ్యాపారాన్ని పట్టుకోవాలని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమిస్తుంది .సోమ్లా తండాలో అందరికి పెద్ద మనిషి . సోమ్లా ఆధ్వర్యంలోనే తండాలో అందరూ సారా కాయడం దానిని పటేలు వద్దకి చేర్చడం జరుగుతుంది .ఆరోజు రాత్రి రాజు మారు వేషంలో తండాకి చేరుకుంటాడు . ఆ రోజు రాత్రంతా సోమ్లా తోనే ఉంది సారా ఎలా కాస్తారు , ఎంత లాభం వస్తుంది . ఎక్కడికి తీసుకు వెళ్లి అమ్ముతారు అన్ని వివరాలు తెలుసుకుంటాడు రాజు . చివరికి సోమ్లాతో కలిసి సారా కాస్తున్న్ అప్రదేశానికి కూడా వెళ్తారు . అక్కడే అన్నీ పరీక్షగా చూస్తాడు .తెల్లవారుతుండగా రాజుకి మెలుకువ వస్తుంది . అప్పటికే సారా కాయడం దానిని ప్యాకేట్స్ చేయడం అంతా పూర్తి అయిపోతుంది . రాజు తండా నుంచి మార్కెట్ కి వెళ్ళీ దారిలో తన బండి మీదనే తీసుకు వస్తాడు సోమ్లా . రాత్రంతా అన్ని వివరాలు తెలుసుకుని అవకాశం రాగానే అరెస్ట్ చేయాలని చూస్తాడు సి ఐ రాజు .

“ఇంతెందుకు బాపు ..నిన్న మీరు పోలీసులను చౌస్తాకు రమ్మన్న సంగతి గూడా మాకు నిన్ననే తెలిసింది . అందుకే అడ్డా మార్చినం …”బండి స్టాండు వేసి నిలబడ్డాడు సోమ్లా .కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి .యిప్పుడు మిమ్మల్ని ఎవ్వలూ ఏం చెయ్యలేరు బాబు .నన్ను పట్టుకోవచ్చు . కేసు పెట్టచ్చు .కాని ఒక్క మాట . ఇంకెప్పుడూ ఇలాంటి సాహసం చెయ్యకు బాపూ ..”అన్నడు సోమ్లా . నవీన్ నిలువునా వణికిపోతున్నాడు “.

 “గ్లాసియర్” కథలో  శశాంక్ మానసిక వైద్య నిపుణుడు . తాను చిన్నతనంలో స్కూల్ లో చదువుకున్న సమమయంలో టీచర్ గా పని చేసిన వంసంత టీచర్ అంతే ప్రత్యేకమైన అభిమానం ఉండేది . ఒకరోజు శశాంక్ వాళ్ల అమ్మని తీసుకుని కార్ లో వస్తూండగా వసంత టీచర్ మతి స్థిమితం లేకుండా రోడ్డు మీద నడుచుకుని వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతాడు శాశాంక్ . వాళ్ళ అమ్మని అడిగి విషయం తెలుసుంటాడు . వసంత ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న వంసత నాన్న తో మాట్లాడి వైద్యం చేయడం మొదలు పెడతాడు .తాను అనుకున్నట్టున్గానే వసంత లో మారు రావడం గమనిస్తాడు . అసలు వసంత అలా కావడానికి కారణం వెతుకుతూ ఆమెను మునపటి రోజులకి వెనక్కి తీసుకువెళ్తాడు . ఆ  సమయంలో .. సంవత్సరం  క్రితం పొలం అమ్మిన రోజుకు మాట్లాడటం మొదలు పెడతాడు శశాంక్ .

“ఆ సంఘటన గుర్తుకు రాగానే వసంత నిలివేల్లా వణికిపోయింది . ఆమె నోట మాట రావడం లేదు . కలిసి ఉండాల్సిన వయసులో కలిసి లేము . యిప్పుడు కలిసి ఉంది చేసేదేముంది . నష్టమే తప్ప . అతడుంటే పనికి వెల్ల నివ్వడు . వ్యవసాయం చేయ్యనివ్వడు . నా పదెకరాల భూమిలో వందల మంది బతుకుతున్నారు . నాలుగు కుతుమ్బాలితే నా భూమి మీదనే బతుకుతున్నాయి .అంటూ తాను వాళ్ళ మీద పెంచుకున్న ఆప్యాయతను , అభిమానాన్ని చెబుతూ” ఉద్వేగానికి గురి అవుతుంది వసంత .

ఈ విధంగా పెద్దింటి అశోక్ కుమార్ కథలను పరిశీలిస్తే తన కథలలో మానవీయత సందేశంగా కనిపిస్తుంది . వాస్తవికతతో పాటు చదివే వ్యక్తికి దాని వలన ప్రయోజనం కలగడం , ఆలోచన దిశా అడుగులు సాగడం అనేది కలిగినప్పుడు రచయిత రచనకి సార్ధకత కలిగినట్లే .

-చల్లాదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.