వృద్దాప్యం(కవిత )-కె.రాధిక నరేన్

బ్రతుకు చిత్రం లో భవదీయులు
ఎంత మందో
బ్రతుకు నేర్పిన పాఠాలకు
అనుభవ సారమెంతో
విధి మిగిల్చే వింత శాపాలేన్నో ….
అడుగు వేయలేని
నాడు అన్ని అదమరచిన ….
పాత సంతకాల వెతుకు
లాటలో పావురాయి లా ఎగురుతున్న
వదిలి పోయిన ఈకలన్ని….తిరిగి వచ్చిన బాగుండు
నను కొనిన ఉపయోగముండునా…..బ్రతుకు చిత్రం లో
బానిస అయ్యాక……
నిజాలని ఒప్పుకొనిన…కాలం వెనుదిరుగునా..
చిగురించిన కొమ్మ లన్నియు రాలిపోయి
కొత్త చిగురు వేసిన..
గత స్తృతుల జ్ఞాపకాలను మది గదిలో బంధిచిన
వేదనే వేకువ వుతుంది….
అనుభవసారాలను ఆదమరవక…రేపటి తరానికి
ప్రతీక గా నిలిచి ఆనవాళ్లు మిగిలి పోతుంది…
వృద్దాప్యం….

                                                                                            -కె.రాధిక నరేన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.