ఆయుధం కన్నా పదునైనది
అగ్ని గోళం మంత మెరుపైనది
హిమం కన్నా చల్లనిది
సుమం కన్నా పరిమళమైనది— మాట
నిశబ్దపు మేడల గోడల్ని
శబ్దం అనే అస్త్రం తో పడగోట్టేడి — మాట
నిండు మనస్సును నిలువునా కాల్చేది
పండంటి బతుకుని చితిలా పేల్చేది—మాట
అంతరాల దొంతరల్ని మార్చేది
వింత మలుపు జనంలో కూర్చెది— మాట
నిరాశ నిస్పృహల నీడలో
ఆశల మేడలు నిర్మించేది ఒక — మాట
ప్రభువుల జాతకాలను భాష్యం చెప్పేది
రాజ్యాలలో రబసను పుట్టించేది — మాట
ఒక క్షణం లో ఆనందపు అంచుల్ని తాకించే
మరో క్షణం లో అగాదపు గోతుల లోతుల్ని చూపేది — మాట
సత్యాన్ని క్షణం లో హత్య చేసి
అసత్యానికి జండా లూపెది— మాట
వత్సరాల వలపు వసంతాలను
క్షణాల్లో నిశీధిగా మార్చేది — మాట
వెలిగే జీవితాల మద్య తిమిరాన్ని
తియ్యని స్నేహం వెనుక సమరాన్ని పుట్టించేది — మాట
నిర్మల తటాకంలో రాయి ముక్కలా
పాల గిన్నెలో విషపు చుక్కలా ఒక — మాట
కన్నీటి వెల్లువకు కట్టవేసేది
పన్నిటి జల్లులు కురిపించేది — మాట
కాల వాహినీ తీరం దూరమైనా దరిచేర్చి
గుండెలోతుల్లో ఈతలు వేసేది — మాట
మాటను తూచి మాట్లాడితే ఫలం
ఇష్టమొచ్చినట్టు వాడితే కలకలం
బతుకు పుస్తకంలో అనుభవాలే అక్షరాలు
సమయోచిత భాషణలో ‘మాట’ లే అస్త్రాలు
– డా. ఊటుకూరి వరప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
‘ఆయుధం కన్నా పదునైనది’ అన్నారు
ఎఆయుధంకంటే పదునైనదో వ్రాయలేదు
అన్ని ఆయుధాలు పదునుగా ఉండవు
‘అగ్ని గోళం మంత మెరుపైనది’ అని వ్రాసారు
అగ్ని గోళం అంత వేడికలది అంటే బాగుండేది
ఎందుకంటే హిమమంత చల్లగా అని తరువాత వ్రాసారు కదా
సుమం కన్నా పరిమళమైనది అని వ్రాసారు
సుమాలకన్న అనిఉంటె బాగుండేది
ఒక్కో సుమం ఒక్కో రకమైన సువాసనను కలిగి ఉంటుందికదా
ప్రతి మాట తరువాత మాట అని ఎందుకు వ్రాసారో తెలియలేదు
ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని చోట్ల “మాట” లవల్ల వచ్చే అనర్ధాల గురించే వ్రాసారు
మాటలు మాట్లాడి వదిలిపెడితే పరవాలేదు- మనషులు సహజంగా మరచిపోతారు
వాటికి బ్రతుకు పుస్తకంలో అక్షర రూపమిస్తే మరచిపోయినప్పుడల్లా అస్త్రంలా గుచ్చుతుంది
నా ‘మాట’ లు నిజంగా మీకు నచ్చి ఉండకపోవచ్చు
కాని నిజానికి
ఒక మంచి మాట చెప్పమంటారా డాక్టర్ గారూ
మీరు విహంగకు మొదటిసారిగా ‘మాట’ల హారం వేసారు
మీ ‘మాటల’ అస్త్రాలతో మా నిశబ్దపు మేడల గోడల్ని పడగొట్టారు