అరణ్యం-దేవనపల్లి వీణావాణి

ఆది నుంచి ఈనాటి ఆధునిక మానవుని ప్రస్థానం వరకు  ప్రకృతి కల్ప వికల్పాలే పరిణామ క్రమం.పరిశోధనలు పరిశీలనలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిణామ క్రమంలో అవి సిద్ధాంతాలుగా మనగలుగుతాయేమోగానీ ఆ ప్రాకృతిక  చలన శీల రహస్యం ఎప్పటికీ రహస్యమనే అనుకుంటాను..బహుశా అందుచేతనే అది తాత్విక చింతనా భూమిక అయింది. నిరంతర అన్వేషణలో మానవుడు చేస్తున్న ఒక అవిచ్చిన్న  ప్రయత్న పూర్వక శోధన ఈ రహస్యాలను ఒక్కక్కొకగా తెలుసుకునే పరిణితి మానవున్ని ఉచ్ఛ స్థితిలో ఉంచుతున్నది.

గత కొన్ని శతాబ్దాలుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా ప్రకృతి సహజ ఎంపిక సూత్రాన్ని మానవుడు ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాడన్న విషయం మనకు అర్థం కానిది కాదు. కొంత చైతన్య వంతమైన సమూహాలు దీనిని కట్టడి చేయడం కొరకు 

సమాయాత్తమైనప్పటికి అది సరిపడినంతగా లేదు.

నేటి పరుగులయుగంలో తనకూ ప్రకృతికి, ప్రకృతికి సంస్కృతికి ,సంస్కృతికి నాగరికతకు ఉన్న సంబంధం వాటి మధ్య ఉన్న అవినాభావపు లంకెలు గుర్తించగలిగే తీరుబడి లేక పోవడం ఒక కారణమైతే ఒక అహగహన కలిగించే రచనలు లేకపోవడం  మరొక కారణం. సాహిత్య కారులు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ, పరిశోధకులు రహస్యాలను అన్వేషిస్తూ విడివిడిగా ప్రకృతిని ప్రతిపాదిస్తూ వచ్చారు. కానీ ఈ సున్నితమైన సంబంధాలు నిత్యం అదే ప్రకృతికి దగ్గరగా వుండే వాళ్లకు అనుభవైకమైనవి. వాటినుంచి ఒక ప్రాకృతిక వారసత్వ వారధిని

నిర్మించుకున్నప్పుడే నేటి మానవునికి  సార్ధకత. అటువంటి వారధి నిర్మించడం వెనుక తెగిన సున్నితపు లంకెలను కలుపుకోవడం, జీవ నైతిక నియమాలను పాటించడం ప్రత్యేకంగా చెప్పనవసరం లేని లక్ష్యాలు. ఆ  లక్ష్యం కోసం చేసే అవిచ్చిన్న ప్రయత్నం ఈ “అరణ్యం”లో ప్రయాణం.

ఈ “అరణ్యం”లో వచ్చే వ్యాసాలు  అడవిని, వృక్ష జంతు జాలలని , మానవునికి గల సంబంధాలని, పరిశోధనలని, చరిత్రను , వికాసాన్ని   , వారసత్వాన్ని   కలగలుపుతూ ఆయా అంశాలను ఆవిష్కరిస్తూ  ఒక సామాన్యునికి అడవి పట్ల, తమ ప్రాకృతిక బాధ్యతల పట్ల , జీవ నైతిక నియమాల పట్ల కనీస అవగాహన కలిగించడమే బాధ్యత గా పెట్టుకుని  రాసినవి.

ఈ వ్యాస శీర్షికలను ఆదరిస్తారని విశ్వసిస్తూ…………………………………

   -దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

10 Responses to అరణ్యం-దేవనపల్లి వీణావాణి

 1. ధన్యవాదాలు

 2. ధన్యవాదాలు …

 3. Veenavani says:

  Thankyou very much madam

 4. Ramadevi says:

  All the best veena vaani garu…
  Manchiga undi meeru yenchukunna amahan.

 5. Ramadevi says:

  All the best veena vaani garu…

 6. శ్రీనివాస్ says:

  మంచి ప్రయత్నం వాణి గారు…
  All the best..