దీపావళి (సం)బంధం(కవిత )-యలమర్తి అనూరాధ

ఆకాశానికి దూసుకుపోయేవి తారాజువ్వలు

ఎదలోకిచొచ్చుకుపోయేవిమాటలతూటాలు

విధ్వంసానికిరుజువులుబాంబులు

కుటుంబ నాశనానికి కారణాలు కలహాలు

వెలుగులు విరజిమ్మేవి మతాబులు

ఆప్యాయతలు కూలదోసేవి వివాదాలు

చిటపటలకు నిదర్శనాలు టపాసులు

ఆలుమగల కయ్యాలకు ప్రతిబింబాలు

నిజానికి అబద్దానికి అద్ధం పట్టేవి

పాముబిళ్లలు

లోపలొకమాట బయటికొక మాట ఈనాటి

సంబంధాలు విరబూసే చమక్కులు

కాకరపువ్వొత్తులు

మదిలో పూచే పువ్వులు ఆనందపు సిరులు

రోడ్డుకు సింగారం చిచ్చుబుడ్లు

కలివిడికి ఆదర్శం అగ్గిపుల్లలు

ఉమ్మడి కుటుంబాలుకు గుర్తు నెరవేరని

ఆశలు

చెరగని ముద్రలు పెన్సిల్ కాంతులు

చెరుపుకోలేనివి గతాల యుద్ధాలు

నింగిన హరివిల్లుల చిత్రాలు మనసున

సంతోషాల సరదా చిందులు

చీకటికి అలంకారం దీపావళి సంబరాలు

                                                                -యలమర్తి అనూరాధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.