గజల్-8 -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సులు

సృష్టిలోని అద్భుతాలకి అన్నిటికీ మూలం ఒక స్వరూపం ఏదైతే ఉందో
ఆ స్వరూపానికి ఇంత అందమైన ప్రకృతిలో నన్ను పుట్టించినందుకు
శతకోటి నమస్సులు అర్పిస్తూ వ్రాసిన గజల్ ఇది. ప్రకృతిలోని అందాలకు ఉపమానాలు  అనేవి  లేనే లేవు.ఎన్నో వేలలోనో , లక్షలలోనో ఉండే అందమైన రంగురంగుల పూలను చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది… ఈ పూలన్నిటికీ ఎవరు రంగులు పూసారో అని. నురుగులు నిండిన పెదవులతో తరంగాలు, తీరానికి ఎన్ని ముద్దులను ఇస్తుందో మనకు తెలియనిది కాదు. ఆ తరంగాలకు నురుగును ఎవరు పూస్తారోనన్నది నా సందేహం.కళ్ళకు ఎంతో అందంగా కనిపించే ఇంద్రధనస్సుకి ఏడురంగులను అద్దడం నిజంగా అద్భుతం కాదా?

ఇలాంటి భావాలతో నింపినదే  ఈ గజల్     

తూర్పునుదుటన ఎర్రతిలకము దిద్దివెళ్ళిన వారు ఎవరో ?
సూర్యుడెళ్ళే పడమటింటికి దారి చూపిన వారు ఎవరో?

ఎన్నికుంచెలు ఎన్ని చేతులు వాడినారో తెలియలేదు
చైత్రమాసపు వేల విరులకు రంగులేసిన వారు ఎవరో ?

కడలితీరము తెల్లముద్దులు తీసుకుంటూ మురిసిపోవును
నీలివర్ణపు తరంగాలకు నురుగుపూసిన వారు ఎవరో?

రాతిరైతే లోకమంతా అంధకారములోన మునుగును
తారలిచ్చిన కాంతివలలో నిశనుపట్టిన వారు ఎవరో ?

సంజెవెలుగుకి తడిని అద్దితె వర్ణమయమే ఓ నెలరాజ
నల్లమబ్బుకి ఏడురంగుల చీరలిచ్చిన వారు ఎవరో?

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)