గజల్-6 -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సులు 

కొన్నిటిని చూడాలంటే ఎంత కష్టమో, అసాధ్యమో ఈ గజల్ చదివితే తెలుస్తుంది 

కాలచక్రంలో ఋతువులు వాటి కాలాన్నిబట్టి వస్తూ ఉంటాయి . ఆకులు రాలే కాలాన్ని చూడని వనం ఉండదు. కానీ నిత్యవసంతంలో మునిగిపోయే వనం ఉంటే ఎంతో బాగుంటుంది. అలాగే వాడిపోని పూలుండే చోటు ఉంటే ఎంతో బాగుంటుంది కదా. మూఢనమ్మకాలతో ప్రజలను వెర్రివాళ్లను చేస్తూ మంత్రాల పేరుతో, పూజల పేరుతో  దోచుకొనే వారి ఆటలు సాగనివ్వని ప్రజానీకం ఉంటే  ఎంత బాగుంటుంది? శాంతిని మించిన వరం ఎక్కడ ఉంది?వాస్తవాన్ని చూపించే స్వప్నం ఎక్కడ ఉన్నది? ఇలాంటివి ఉంటే ఎంతో బాగుంటుంది అనే భావాలను ఈ గజల్ లో పొందుపరచడం జరిగింది. 

శిశిరాలను చూడనట్టి వనమెక్కడ ఉన్నదో
వసివాడని పూవులున్న చోటెక్కడ ఉన్నదో

దప్పిగొన్న ధరణి కేక నింగివరకు చేరదూ
చిరుజల్లును కురిపించే మొయిలెక్కడ ఉన్నదో

మంత్రాలూ తావీజులు మన బాధను తీయవూ
మూఢనమ్మకాలు లేని మతమెక్కడ ఉన్నదో

యుద్ధోన్మాదము ఉంటే సౌఖ్యమన్నదే లేదు.
శాంతిగీతమాలపించు ప్రజయెక్కడ ఉన్నదో

నిజమౌతుందేమోనని భ్రమపడుతూ ఉంటాము
వాస్తవాన్ని చూపించే కలయెక్కడ ఉన్నదో

ఒకరు ఓడిపోతేనే వేరొకరికి విజయము
గెలుపొకటే చూసిన రణభూమెక్కడ ఉన్నదో

అల్లుకున్న యామినినే ప్రేమిస్తూ “నెలరాజ”
తారల మాలలనిచ్చే చేయెక్కడ ఉన్నదో …

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)