గజల్-5 -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సులు 

ప్రేయసి సౌందర్యాన్నివర్ణించేందుకు ఎప్పుడూ పదాలు తక్కువైపొతూ ఉంటాయి. ఎన్ని భాషలలో వెదికినా దొరకనంటూ ఉంటాయి. నల్లమబ్బునల్లుకున్న మెరుపు అందం , వానలో తడిసిన తరువు అందం కలబోసిన అందం నా చెలిది అంటాను. ఎక్కడ తాకినా తీయని అనుభూతి కలుగుతుంటే మధువును నింపుకున్న పూలతో చేసిన మన్మథబాణంలా ఉన్నది. చూపులలో కురిసే జల్లును చూస్తే వసంతుడు పూలయాగం చేస్తున్నట్లుగా ఉంటుందనే భావాన్ని ఒక షేర్ లో చెప్పాను. ఇంద్రధనస్సు అందాన్ని , యవ్వనంతో నిండిన నదము వయ్యారాన్నీ నా ప్రేయసితో చూస్తున్నాను. ఆమెతోనే జీవితాన్ని ఊహలలో చూస్తుంటే బుగ్గన ఒక్క చుక్క పెడితే నాతో జీవితాన్ని పంచుకొనే పెండ్లికూతురిలా ఉంటుందనే భావాన్ని మక్తాగా మలిచాను. 

ఈ గజల్ మీకోసం ……………

నల్లమబ్బునల్లుకున్న మెరుపులాగ ఉన్నావూ
తొలిజడిలో తడుస్తున్న తరువులాగ ఉన్నావూ

తనువులోని కెరటాలకు అడ్డుకట్ట వేయలేవు 
యవ్వనాన్ని నింపుకున్న నదములాగ ఉన్నావూ

గుచ్చుతున్న చూపులలో తేనెజల్లు కురుస్తోంది 
వాసంతుడు తలపెట్టిన క్రతువులాగ ఉన్నావూ

అణువణువున మకరందం రాజ్యమేలుతుంటుంది 
పుష్పశరుడు సంధించిన ములుకులాగ ఉన్నావూ

కనులలోన వేనవేల వర్ణాలను నింపుతావు 
వానవిల్లులో రంగుల విరుపులాగ ఉన్నావూ

నీ అడుగులు పడిన మనసు…కాంతులతో నిండుతోంది
పాలపుంతలో పుట్టిన తళుకులాగ ఉన్నావూ

నీతోనే జీవితాన్ని కలగన్నా ” నెలరాజా “
బుగ్గచుక్క తక్కువైన వధువులాగ ఉన్నావూ

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

One Response to గజల్-5 -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

  1. anand says:

    namasthe srinivas gaaru ,
    miru rasthunna gajals chaalaa baagunnaayi .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)