మదిలో కలిగే పరవశం(కవిత )-వెంకట్ కట్టూరి

పచ్చనిచేలపై వీచే పైరగాలికేం తెలుసు….
ప్రియుడి స్పర్శ తగిలితే మదిలో కలిగే పరవశం…

సముద్రపుటలలపై తేలియాడే నావకేం తెలుసు.. సాగరతీర తన్మయత్వం …

సముద్ర తీర సైకత వేదికపై సేదదీరే కొత్తజంటలలో కలిగే పరవశం…

ఆ సంద్రపు అలలు తాకే నల్లరాతికేం తెలుసు…

ఆ చల్లని తుంపరలు ఎదను తాకితే మనసున కలిగే పులకరింత..

నునులేత మావి చిగురుతిని కూహు కూహు రాగం తీసే కోయిలకేం తెలుసు..
తన గానంలోని మాధుర్యం…

ఆ గానామృతాన్ని ఆస్వాదించి పారవశ్యాన్ని పొందే మనసుకు మాత్రమే తెలుసు ఆ తీయదనం….

పైరు చేతి కొచ్చినపుడే కలుగు రైతుకంట్లో ఆనందం …

మగడు మెచ్చినపుడే మగువకు కలుగు మదిలోన పరవశం …

గురువు కొట్టినపుడు తెలియదు ప్రయోజనం…

నలుగురు మెచ్చినపుడు తెలియును గురువు గొప్పదనం…

శిష్యుని ఎదుగుదలను మెచ్చి పొంగును గురువు ఉల్లము అల్లన..

-వెంకట్ కట్టూరి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)