*రెక్క విప్పిన మనసు( కవిత )-కోసూరి జయసుధ

ఏమని కోరనూ…
నిన్నెలా కోరనూ..
ఏమని వివరించనూ…
నీకెలా వివరించనూ…
ఏమని వినిపించనూ…
నీకెలా వినిపించను..
నా మనసు పలికే మౌనగీతాన్ని
నిన్ను చూసిన ఆ క్షణం…
మనసు రెక్కలు విప్పుకుంది..
మరిచిపోలేక…
మరెప్పటికీ వదలలేక…
చేరువకాలేక…
చేరుకోలేక….
మనసు మరపు రాక..
మరిచిపోలేక…
నిన్ను చేరే
ప్రయత్నమే చెయ్యలేదు…
చేరాలనే ఉంది…నీ చిన్ని మనసును
అసలు మర్చిపోతే కదా..
గుర్తు చేసుకోవడానికి….
నీ జ్ఞాపకం నాకు తోడుగా లేనిది ఎప్పుడని….
నీ కనులు చెప్పే ఊసులు నను వెంటాడనిదెప్పుడని….
అందుకే….
మనసుకు నేర్పాను…
నీ కలల కూర్పుని…
నీ జ్ఞాపకాల సాక్షిగా…
కలల సౌధమే నిర్మించా…
ఇది నీకెలా చెప్పాలి….
ఏమని చెప్పాలి…
ఇంతసేపూ నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా….
తెలుసుకోగలవా..
నా అనుభూతిలోని గాఢత
నీకు తెలీకపోతే…
నా ప్రేమలో నిజాయితీ లోపించినట్లే…
నేను నేనుగా ఉన్నానంటే నీ అనుభూతే కారణం…
నీ మనసును మరింత చేరువ చేస్తావా…
నా హృదయంలో ప్రేమాక్షరాలు రాస్తావా…
ఆజన్మాంతం నీ సేవకుడినే..
నీ అనురాగాలకు భావకుడినే..
నన్ను నన్నుగా గుర్తించు…
నీ అనురాగాన్ని మనసారా నాకే పంచు..

-కోసూరి జయసుధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)