ఇవే మా బ్రతుకులు(కవిత )-తాండ్ర రమణ

ఇవే మా బ్రతుకులు
పై పూతలు లేని రూపాలు
స్వాతంత్రాన్ని అమ్ముకున్నాక
నమ్మకాన్నీ కొనుక్కోవాల్సిన దైన్యం
సొంతమంటూ లేని బతుకులు
.
కాళ్ళకూ మనసుకూ మధ్య
సంధీ సంఘర్షణా లేని వైనం
అయినా
పాదాలు పధిస్తూనే ఉండాలి.
మా జీవితాల సత్యాసత్యాల నడుమ
సందిగ్ధాల వంతెన
అటూ మేమే-ఇటూ మేమే
.
కర్ణపేయమైన
సమాజ సంగీతంలో
కులాల మతాల అపస్వరాలు
మా ఎడదలు వింటూనే వుంటాయ్
వాహకం లేని శబ్దంలా
మూగవాని మాటలా
మా ఆకలి చేసే ఆర్తనాదం
ఈ లోకం వింటూనే ఉంటుంది
.
పొరలు పొరలుగా ఊడి పోతున్న
మనిషితనం గోడలమీద
మురిగిపోతున్న నీతి సూత్రాల పై పూత
.
అస్తిత్వం ఆవిరై
జీవితం మసకబారినప్పుడు
వెలుగు మీద బతికే నీడ కూడా
మా ఉనికిని వెక్కిరిస్తుంది
.
విలయాన్ని సైతం లయం చేసే
ఉప్పెన లాంటి వేదనలో
మా బతుకులు ఎంత నగ్నంగా ఉంటాయో
మా ప్రశ్నలూ అంతే నగ్నంగా ఉంటాయి
మావి ప్రశ్నించే బ్రతుకులు
బ్రతుకు కోసమే ప్రశ్నలు

-తాండ్ర రమణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)