జ్ఞాపకం-41 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

సంలేఖకి కంగారు పుట్టింది. హస్విత అన్నంతపని చేస్తుందని సంలేఖ భయం.
ఇంటర్ మీడియట్ చదివే విద్యార్థులకి ఆదివారం ఔటింగ్ వుంటుంది. తల్లి, దండ్రులు ఎక్కువగా ఆరోజే వచ్చి పిల్లల్ని కలిసి వెళ్తుంటారు. వారానికి ఒక్కరోజే ఔటింగ్ కాబట్టి విద్యార్థులంతా తప్పకుండా బయటికెళతారు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న హస్విత ఔటింగ్ రోజు జయంత్ బయటికి రాగానే వెళ్లి కలిసింది.

అప్పుడు దిలీప్ కూడా జయంత్ పక్కనే వున్నాడు. దిలీప్, జయంత్ రూంమేట్ కాబట్టి ఎక్కువగా జయంత్ తోనే వుంటాడు. హస్విత మాట్లాడుతుంటే వెళ్ళబోయాడు ‘పర్వాలేదులే నువ్వు కూడా వుండు’ అన్నట్లు సైగ చెయ్యటంతో అక్కడే నిలుచున్నాడు దిలీప్. సంలేఖ తనకేం చెప్పిందో అది జయంత్ తో చెప్పింది హస్విత.

“చెప్పు జయంత్! సంలేఖ చెప్పింది నిజమేనా?“ అని అడిగింది.
అతను ఆశ్చర్యపోతూ “తనేం చెప్పిందో, నువ్వేం అడుగుతున్నావో, నేనేం వింటున్నానో నాకయితే ఏం అర్థం కావటం లేదు” అంటూ భుజాలను తమాషాగా కదిలించాడు జయంత్.

“హస్విత చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా దిలీప్?” అంటూ వెంటనే దిలీప్ వైపు తిరిగాడు జయంత్.

దిలీప్ మాట్లాడలేదు. ఇందులో జయంత్ కి అర్థం కానిది ఏమిటో ఆలోచిస్తున్నాడు. జయంత్ బాగా చదువుతాడు. అతనికి చిన్నప్పటినుండి బాగా చదువుతాడన్న ఇమేజ్ వచ్చింది. దాన్ని నిలుపుకోటానికి ఇంకా బాగా చదువుతున్నాడు. కానీ తను నెంబర్ వన్ ర్యాంకర్ కావడం కోసం సాటి ర్యాంకర్ని పక్కదారి పట్టించడం పద్దతి కాదు.

“నీకు ర్యాంక్ రావడం కోసం తను నార్మల్ గా చదువుతానంటోంది. ఎంత ప్రేమ వుంటే మాత్రం చదువును త్యాగం చేస్తారా?”

“ప్రేమేంటి కొత్తగా ?” నవ్వాడు జయంత్.
“తను నిన్ను ప్రేమిస్తోంది జయంత్”

“నాకేం అభ్యంతరం లేదు. దానివల్ల నాకొచ్చే నష్టం కూడా ఏంలేదు. అందుకు నేను బాధ్యుడ్ని కూడా కాదు” అన్నాడు నిర్లక్ష్యంగా.

”బాధ్యుడివి కావా? నువ్వు తనని ప్రేమించకుండానే ఇదంతా జరుగుతోందా?”
“నేను ప్రేమించడం ఏంటి? నా వయసు ఎంతని? ఇంటర్లోనే ప్రేమించడం వుంటుందా? అసలు లైఫ్ గురించి నాకేం తెలుసని నేను ప్రేమిస్తాను? ప్రేమంటే చిన్న పిల్లలు ఓ చోట కూర్చుని అమ్మా, నాన్న ఆట ఆడుకోవడం లాంటిదనుకుంటున్నారా?” అన్నాడు.
షాకింగ్ గా చూశాడు దిలీప్. హస్విత కూడా అలాగే షాక్ తిన్నది.

“నువ్వు తనతో క్లోజ్ గా లేవా?” అంది హస్విత.
“వున్నాను. వుంటే అది ప్రేమైపోతుందా? దిలీప్ కూడా తనతో క్లోజ్ గానే వుంటాడు” అన్నాడు జయంత్.
దిలీప్ వెంటనే కల్పించుకున్నాడు.

“సంలేఖతో నేనెప్పుడూ క్లోజ్ గా లేను జయంత్! నువ్వేదో కన్ఫ్యూజన్ లో వున్నావు. మనం ఇప్పుడు ఏ క్లాస్ లో వున్నామన్నది కాదు. ఎయిత్ క్లాస్ నుంచే అమ్మాయిలు ఏ అబ్బాయి ఆత్మీయంగా మాట్లాడితే ఆ అబ్బాయి సమక్షాన్ని ఇష్టపడుతుంటారు. వాళ్లు చెప్పే మాటల్ని కూడా ఆసక్తిగా వింటూ ఏదో కొత్త రకమైన ఫీల్ తో వుంటుంటారు. అలాంటిది నువ్వు సంలేఖతో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతుంటే మాకే అన్పించింది మీ ఇద్దరు లవర్స్ అని” అన్నాడు దిలీప్.

“మీకు అన్పిస్తే సరిపోతుందా ? నాకేం అన్పించనవసరం లేదా?” అన్నాడు జయంత్ దబాయిస్తూ.
“నీకేం అన్పించలేదంటే ఎవరు నమ్ముతారు జయంత్? నిజం చెప్పు? సంలేఖ పట్ల నీకేం ఫీల్ లేదా?” సూటిగా అడిగాడు దిలీప్.

“ఫీల్ లేదా అంటే వుంది. సంలేఖను చూస్తే ఎవరైనా పాజిటివ్ గానే ఫీల్ అవుతారు. అంత మాత్రాన అది లవ్ అని నమ్మి, తిరిగి తను కూడా లవ్ చేసి, అదేదో పెద్ద ర్యాంక్ తెచ్చుకుని సెలబ్రేట్ చేసుకున్నట్లు హస్వితతో చెప్పి ఇదంతా నాకెందుకో సిల్లీగా అన్పిస్తోంది” అన్నాడు జయంత్.
హస్వితకి జయంత్ మాటలు నచ్చలేదు.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)