పరుగులరాణి(హిమదాస్)-కవిత -కె.రాధికనరేన్

అలసి సొలసిన కనులకు ఆశల
తీరాలే కనబడినపుడు పాదాలు
కందిన లక్ష్యసాధన లో ముల్లు లపై
నడిచిన దారి పూల పాన్పు నుచేసుకున్నావు

ఆకలి కి ఓ‌ర్చిన ఎన్నో రాత్రులు
కన్నీటి ధారలై నీ రుధిరాన్ని చెమట గా
మార్చావు కష్టాసుఖాల బాట లో హిమం లా గడ్డ కట్టకహిమ దాసులా కరిగావు

నీలో దాగిన పరుగుల కడలి
ని హిమగిరుల జలపాతం లా
దూకించావు హిమలయాలంత
ఎత్తు కెదిగావు

నీ కనురెప్ప లు మూసుకుపోయిన
పరిమళించిన కుసుమానివై ఆందరి లో
నిలిచావు .
భారతవని కి మరో చంద్రాయాన్ అయ్యావు

కె.రాధికనరేన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.