నేస్తమా(కవిత )–కె.రాధిక నరేన్

నువ్వోక మూసిన దోసిటదాగిన పరిమాళనివో
మనసు కు నచ్చిన పారిజాతనివో
పిలిచినా పలకని చిలకవై , పలుకులు
లేక చిన్న బోయేనేస్తం

చెలిమికి చేయి అందించా నీ కోసం
నెయ్యము తో ప్రియ నేస్తం అయ్యావు
కాలం తో పాటు సాగుతోంది ……..
నాకు నచ్చిన నేస్తమా …..
అక్షరాలతో కలిసిన మనం
అక్షర మాలగా ఓకే దండలో
ఒదిగాం…….. కానీ
ఇరుకైన ఈ హృదయం గోల పెడుతుంది
ఇది నిజమా కలా అని ,నిజమయితే
నిప్పులపై నడిచి న సంతోషమే మరి
అబద్దమయితే……….

నిప్పు లో నడిచే అవసరం లేనిది
కాల పరీక్ష కు నిలిచింది మన స్నేహం
దండలో పూసలమై …..,మాలలో పువ్వు లమై….పదాలలో అక్షరాలమై…..
నిజమో…..అబద్ధమో…పోల్చుకోలేనిపరవశంలో
కాలమంతా కలిసి సాగుదాం…. !

మన ఊహల మేఘాలకు మన బావాల తీపి ని
కలిపి ఊసులబాష చల్లదనంతో స్నేహమనే వర్షం లో
మన తడిసి తడిసి పోవాలి.

ఆకాశపు అంచులు చుట్టి అక్షరాలతో

మనసునుతాకి కలకాలం సాగాలి.

-కె.రాధిక నరేన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to నేస్తమా(కవిత )–కె.రాధిక నరేన్

  1. Radhikanaren says:

    Tq andi

  2. అనిత గౌరీ says:

    రాధిక గారు … మీ నేస్తమా కవిత ….మనసుకు తాకింది . మీరు మరిన్ని కవితలు రాయాలని ఆశిస్తున్నాను .