గజల్-4 -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ని ఆదరిస్తున్న పాఠకులకు నమస్సుమాంజలి. భగ్నమైన ప్రేమికుని మనస్సును ఆవిష్కరించే ఓ ప్రయత్నంలోనుంచి పుట్టిన గజల్ ఇది. పన్నీరు కావాలని కోరుకుంటే కన్నీరు దొరకడం, అలాగే చిరుజల్లుని కోరుకుంటే తుఫాను దొరకడం లాంటి భావాలతో ఈ గజల్ మత్లా వ్రాయడం జరిగింది. ఋతువులు క్రమం తప్పకుండా వస్తాయి ఎప్పుడూ. శిశిరం తర్వాత వసంతం రావాలని కోరుకుంటే మందు వేసవి దొరుకుతోంది అనే భావం వసంతం అనేది లేని జీవితం అయిపోయిందని ఒక షేర్ లో చెప్పడం జరిగింది. ప్రేమించిన దేవతకు మనసులోన ఓ మందిరం నిర్మిస్తే ఆ దేవత మాయమైపోయి, శిథిలమైపోయిన గోడలతో ఉన్న గుడి మాత్రం మిగిలిందని చెప్పడం …ప్రేయసి ప్రేమను నూరేళ్ళపాటు పొందాలని కోరుకునే వ్యక్తికి చివరి ఘడియ దొరకడం కంటే దారుణమైన విషయం ఉండదు కదా ! ఇలాంటి వేదనతో కూడిన గజల్ మీకు నచ్చుతుందనే భావిస్తున్నాను .

పన్నీటిని కోరుకుంటె కన్నీరే దొరుకుతోంది
చిరుజల్లుని కోరుకుంటె తూఫానే దొరుకుతోంది
వసంతాన్ని వీడిపోని తోటకొరకు వెదికానూ
పరిమళమంటే తెలియని కారడవే దొరుకుతోంది
ప్రణయించిన దేవత ఎటు వెళ్లినదో తెలియలేదు
శిథిలమైన గోడలున్న మందిరమే దొరుకుతోంది

ఋతువులు కూడా మాటలు వినకున్నవి అదేమిటో
తొలకరి’నే’ కోరుకుంటె వేసంగే దొరుకుతోంది
ప్రాణవాయువే లేదని ఆశలారిపోతున్నవి
అరచేతిని తోసివేయు సుడిగాలే దొరుకుతోంది
చిరకాలం చెలిప్రేమను పొందాలని అనుకున్నా
నూరేళ్ళను కోరుకుంటె తుదిగడియే దొరుకుతోంది
ప్రేమించిన పాపానికి శిక్షేమో ‘నెలరాజా’
స్వర్గాలను కోరుకుంటె మరుభూమే దొరుకుతోంది.

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)