గజల్-3 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ని ఆదరిస్తున్న పాఠకులకు నమస్సుమాంజలి. గజల్ అంటేనే ప్రేయసితో సంభాషణ అని ప్రఖ్యాత గజల్ కవులు చెప్పనే చెప్పారు. దర్ద్ ( అంటే బాధ ) లేకుంటే గజలే లేదంటారు గజల్ కవులు. ప్రేమ కంటే వియోగం విరహం ఎక్కువగా ఉంటాయి గజళ్ళలో. ఎత్తుగడ చూస్తేనే తెలుస్తుంది ఎదురుచూపు ఎంతో భారమైనదనీ, వాటిని మోసేందుకు కన్నులు ఎంత కష్టపడతాయో , నిరీక్షణలోని యుగాలను కన్నులు మోయలేకున్నాయని. పాటలలో సంగీతపరంగా సంగతులు ఉంటాయి. కానీ ఇక్కడ సంగతి అంటే అంటే తన ప్రస్తావన లేకుండా వ్రాయలేను అంటూ చమత్కరించడం… రెంటికీ సరిపడేలా వ్రాయడం జరిగింది. వేరే ఎవరైనా పరిహసిస్తారని ఆలోచనే లేకుండా ప్రేయసి గురించే గజల్ వ్రాస్తానని చెప్పడం మరో షేర్ లో చూడవచ్చును. ప్రేయసి నవ్వులతోనే విరహాన్ని జయించగలను అంటూ ఆమె నవ్వులు లేకుంటే విరహాన్ని జయించలేనంటూ చెప్పడం మరో షేర్ లో చూడవచ్చును. బాధలో కూడా ప్రేమను చూపించే షేర్లతో ఈ గజల్ ని ముగించడం జరిగింది.

ఎదురుచూపు బరువెంతో చెప్పలేను ఎప్పటికీ
ఒంటరిగా ఈ యుగాలు మోయలేను ఎప్పటికీ
గొంతులోని రాగాలకు మొరాయింపు ఎందులకో
నీ ‘సంగతి’ లేని పాట పాడలేను ఎప్పటికీ
నీ నవ్వులు లేకుంటే నిరాయుధుడనైపోతా
విరహంపై యుద్ధానికి వెళ్ళలేను ఎప్పటికీ
పరులు పరిహసిస్తారని ఆలోచన లేనెలేదు
నీ ఊసులు లేని గజలు రాయలేను ఎప్పటికీ
నిను పిలిచిన ప్రతిసారీ పదేపదే పిలుస్తాయి
పర్వతాల ప్రతిధ్వనులనాపలేను ఎప్పటికీ
తొలిచూపుతొ మనసంతా దోచుకున్న దొరసానివి
నీకు తప్ప ఎవ్వరికీ చెందలేను ఎప్పటికీ

పరిమళించు నీ శ్వాసలు దొరకకుంటె “నెలరాజా”
ఊపిరులకు చందనాన్ని పూయలేను ఎప్పటికీ

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)