చిట్టి తల్లి(కవిత )-కె.రాధిక నరేన్

కళ్లు లేని లోకమా!
చితికిన చిట్టి తల్లి ని అడుగు తున్నాను
నే చేసిన నేరమేమి!…….
నా కెందుకు ఈ శిక్ష
అమ్మాయి గా పుట్టడమే నా పాపమా!
మానవత్వం లేని మృగాళ్ల మధ్య
మా అమ్మ నాకు జన్మ యిచ్చి నందుకా!
పసి ప్రాణమని చూడలేని కామాంధులమధ్య
నేను ఉన్నందుకా!
ఎందుకు పంపించవయ్యా! దేవుడా!
కళ్ళు మూసుకు పోయి ప్రవర్తిస్తూన్న
రాక్షస జాతి లో కూడ లేని నీతికి నేను
బలి అయ్యానా! నాకు రక్షణ లేదా!
దీనికి అంతం లేదా…….! మా అమ్మ
కు కడుపు కోత మిగిల్చిన ఆ కామాంధుడి
కి శిక్ష ఏది? నా బోసి నవ్వు ల చిరునామా ఎక్కడ….
కాలమా ! కనికరమే లేదా నీకు…..
మా జీవనం ప్రశ్నార్థాకం కానీయకుమా……

( 9 నెలల పసిపాప పై ఆత్యాచారం పై రాసిన కవిత)

-కె.రాధిక నరేన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.