నే చేసిన తప్పెంటి?(కవిత )-కె.రాధిక నరేన్

అవని పైకి కొచ్చాను అందాల జాబిలి గా
మెచ్చుకొన్నారు కొందరు వద్దాన్నారు కొందరు
నేను చేసిన తప్పు ఏమిటో నాకే తెలియదు
అందమైన దానిని అని పొగిడారు కొందరు
అందుకోవాలని చూశారు కొందరు…..
అందనంత దూరంలో ఉంటేనే విలువ నాకు
అందితే మాత్రం మచ్చలే వస్తాయి నాకు
నేను లేనిదే సృష్టి లేదంటారు.సృష్టకి
విరుద్ధమైన పనులు చేస్తుంటారు
నాతో….
నేను చేసిన తప్పు ఏమిటో నా కే తెలియదు
బంగారు పంజరంలో బంధీస్తారు నన్ను
విలువ లేదని సంధీస్తారు నన్ను
అందరికీ నచ్చేనేను ,అలుసైపోయాను
అందరి అవసరాలు తీర్చే మరబొమ్మానైనాను
అయినా నేను చేసిన తప్పు ఏంటో నాకే తెలియదు
నేను లేనిదే ఇంటికి కళ లేదు అంటారు
కళ తేచ్చే నన్ను కాటికే పంపుతారు
పసిపాప గా ,పడతిగా ,లలన ,మగువ గా ఎన్ని
పాత్రలు మార్చి అలసిపోయిన గాని అయ్యె పాపం
అనే వారు లేరు గా……
అయినా తెలియదు నాకు నేను చేసిన తప్పేంటో
ఈబంధనాల విముక్తిలో అలసి సొలసి పోయాను
ఆడపిల్లగా పుట్టినందుకు అశ్రువులు రాలుస్తూన్నాను
అయినా నేను చేసిన తప్పేంటో నాకే తెలియదు.

-కె.రాధిక నరేన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.