అబద్దం – నిజం(కవిత )-దేవనపల్లి వీణా వాణి

ఏది అబద్దం
ఏది నిజం

అది అబద్దమైతే ఇది నిజం
అది నిజమైతే ఇది అబద్దం
రెండూ అబద్దం కాదు
రెండూ నిజం కాదు

అబద్దం గాలి
నిజం నీడ
గాలిని పట్టుకొలేవు చూడలేవు
నీడను పోల్చుకోలేవు చెప్పలేవు

అబద్ధం తుఫాను
నిజం తుంపర
తుపానుకు కొట్టుపోయినవి కట్టబడవు పట్టుబడవు
తుంపరకు గొంతు నిండదు నేల తడవదు

అబద్ధం నిజాన్ని కమ్మి
నోళ్లను గెలుస్తుంది
నిజం అబద్ధాన్ని విరిచి
కాలాన్ని మలుస్తుంది

అబద్ధం నిజం ఆటలో
చరిత్ర చిక్కుముడి పడుతుంది

ఏది నిజం
ఏది అబద్దం
అబద్దం ఎన్నటికి నిజం కాదు
నిజం ఎన్నటికీ అబద్ధం కాలేదు

అదే నిజం
మిగతాది అబద్ధం..

-దేవనపల్లి వీణా వాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.