ప్రేమ (కవిత )-గిరి ప్రసాద్ చెలమల్లు

భావాలు అటూఇటూ
ఊగిసలాడుతూ
ఊసులాడుతూ
దృష్టి తో
అంతర్వాహినై
దృక్పథమై
ఎన్నెన్నో కోణాల్లో
నిక్షిప్తమై
ఎవరిపై ఏ క్షణాన కురుస్తుందో

కళ్ళల్లో కదలాడే రూపమో
అంతర్గతంగా
పాతుకుపోయిన ఎజెండాయో
ఏనాటికీ మారక
తచ్చాడినా హద్దుల్లో సంచరిస్తూ
సౌందర్య భావన మోహంలో
వ్యామోహ పరిధి దాటక

ఇరు హృదయాల
హార్మోన్స్ ఫెర్మెంట్స్ విడుదలలో
ఇరుమనసుల ఏకాగ్రతలో పటిష్టమైన
ఆకర్షణ
సాంఘికావసరాల మేలుకలయికలో
అయస్కాంత ఇరు దృక్కోణాల మేలుకొలుపు

నైతికత
గత వర్త మాన
భావిబంధాల పెనవేతలో భాసిల్లే ప్రేమ

గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.