ఋతువద్గీత(కవిత )-మెర్సీ మార్గరెట్

ఎప్పటిదో
చిన్ననాటి
ఒక
ఋతువు ఎదురుపడింది

ఆకులు రాలిన
ఇంటిని
పతంగిలా మార్చి
ఎదురుగా ఉన్న చెట్టుపైకెగరేసింది

మనుషుల్ని
మంచుముద్దలు చేసి నీళ్లలోకి వదులుతుంది
మట్టికి తన మాటలు చేర్చి
కొత్త కొత్త బొమ్మలేవో చేస్తుంది

ముసలి ఋతువు
నెరిసిన తల
పండిన కథల్ని రాలుస్తుంటే
పిల్లలు దాని కాళ్లదగ్గర కూర్చుని
కథల్లో పక్షుల్లా
సీతాకోక చిలకల్లా మారిపోతున్నారు

-మెర్సీ మార్గరెట్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

Comments are closed.