మన కోసం(కవిత )-డి.నాగజ్యోతిశేఖర్

పేగు విస్తరిలో రక్తమాంసాలు వడ్డించి
ప్రాణాధరువుల్ని పంచి
పాశపు ముంగిట్లో
పారేసుకున్న బతుకు మెతుకుల్ని పోగేసుకుంటున్న
ఆ నిష్కల్మష మస్తిష్కం ఒడిలో గుప్పెడు ఆదరణలు కురియవేం…?

శ్రమల ఇంటి గడపకు
బతుకు పసుపు ముద్దను రాసి
పొద్దు చివర వేళ్లాడుతున్న
రెప్పల్ని బాధ్యతల నిశికి గుచ్చి
పుండౌతున్న ఆ దేహానికి
చిటికెడు ఓదార్పు స్పర్శ దొరకదేం….?

స్వప్నాలన్నీ చింకి బొంతలో కూరి
చితికిన ఆశల్ని పోపు పెట్టె అరల్లో దాచి
వెతలు పెదవి గట్టు కావలె బంధించి
చిరునవ్వు దీపం వెలిగించే
ఆ చెమట చుక్కలకు
ఇంత గుర్తింపు లేపనం
అద్దరేం….?!

అంతేలే!
నిన్నూ, నన్నూ ఒక వస్తువుగా చూసే వారినేం అడుగుతాంలే…?

ఉనికి మరచిన వ్యక్తిత్వం
అనుబంధాలకు అర్పణ చేసి
మది ఖాతాలో శూన్య సంపద నింపుకుంది మనం కదూ….!

స్వార్ధం విడిచిన ఆపేక్షతో
అనురాగాలకు
అర్ధం వెతుకుతూ
స్వేచ్ఛ కు శిక్ష వేసుకుంది
మనం కదూ….!

ఎదుటి గుండెల్లో చోటుకై తపిస్తూ….
అస్తిత్వపు తోడును
దూరాల నీడను చేసుకుంది
మనం కదూ….!

మన హస్తాలను ఆప్యాయతకై చాచి
చేతివేళ్ళ సందుల్లోంచి
మన సమయాలను త్యాగం చేసింది మనం కదూ….!

ప్రేమను మాత్రమే వాంఛిస్తూ
రెక్కలు కట్టుకు ఎగిరిపోయిన బాంధవ్యాలను చూసి
విలపిస్తూ శుష్కిస్తున్నది మనం కదూ….!

మనల్ని మనమో ఖాళీ పాత్రను చేసుకొని
దుఃఖ బిందువుల్ని నింపుతూ
భారపు క్షణాలను మోయడమెందుకు…!?

అందుకే…ఇప్పుడైనా….
రెప్పల తీగలకు కలల పూలను పూయిస్తూ….
ఎద సెలయేటి ఒడ్డున
అభిరుచుల్ని ఆరేసుకుంటూ…
నిర్లిప్త చీకట్లో తప్పిపోయిన వెన్నెల్ని కన్నుల్లో నింపుకొని
ఉత్తేజ గీతమై….
ఆశల ఆకాశపు కాన్వాసుపై
మనదైన చిత్రం గీద్దాం రా!
మన కోసం….
“మన మగువ మనస్సు కోసం..”….
కొన్ని అనుభూతుల పున్నముల్ని
జీవన నింగిలో నింపుకుందాం రా!

                                                                                  -డి.నాగజ్యోతిశేఖర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)