చెల్లుచీటి (కవిత )- గిరిప్రసాద్ చెలమల్లు

ఆమె
గుండెలోతుల్లో దిగమింగుకున్న
కన్నీళ్ళెన్నో
ఘనీభవించి
ఎప్పుడో అప్పుడు
వ్యాకోచం చెంది
కనుపాపలపై
మబ్బులు కమ్మి
ఘర్షణలో సంఘర్షణలో
పగిలిపగిలి
పొగిలిపొగిలి
రాలే చుక్కల వెనుక
ఎన్ని యుగాల వెతలు
పలవరిస్తున్నాయో
ఆపుకుందామన్న
ఆపుకోలేని అంతర్ఘర్షణ
కనుకొసలలో ఆగిన బిందువు
ఉప్పెనని సృష్టించ గల్గితే
వివక్షకిక చెల్లుచీటి

                                                           – గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.