ఓ వీరేశలింగమా….(కవిత -వెంకట్ .కె

పవిత్ర గోదావరి నదీ తీరాన
పున్నమ్మసుబ్బారాయుల సుపుత్రుడవై వెలిశావు
ఆడబిడ్డల జీవితాలలో వెలుగులు నింపడానికై మోడువారిన బీడు భూములపై
వర్షపు జల్లులు కురిసినట్లుగా
పసితనపు వయసులోనే పసుపు కుంకుములకు దూరమై
వంటింటి కుందేళ్లుగా
నరక ప్రాయమనుభవిస్తూ
అంధకారంలో మ్రగ్గిపోతున్న వారి జీవితాల్లో వెలుగు ప్రకాశించడానికై
ప్రచండ భాస్కరుడవై ప్రభవించావు
అదిలింపులకు బెదిరింపులకు లొంగలేదు
నుదిటిన చిరిగిపోయిన తిలకం దిద్దావు
సహవిధ్యకై కృచేసినావు
కులమత బేధాలను రూపుమాపావు మూఢాచారాలను నిరోధించావు
వితంతు పునఃర్వివాహలు జరిపించావు
సంఘ సంస్కరణాభివృద్ది కై
పాటుపడినావు
స్వీయచరిత్ర కాద్యుడవు
నవలా రచనకు పూజ్యుడవు
నాటక రంగానికి మార్గదర్శివి ప్రహసనాల రూపకర్తవు
స్త్రీ విద్యకై పాటుపడినావు
సమాజాహితం కోరుకున్నావు
సమజాభివృద్ధికై అడుగులేసిన నీ సేవలను మరువలేమయ్యా
ఓ వీరేశలింగమా…..

   -వెంకట్ .కె

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.