అసృష్టి (కవిత )– గిరిప్రసాద్ చెలమల్లు

అదొక
లోకం
భవిష్యత్తులో
కొంగ్రొత్త సంభోగ ప్రక్రియలు

ఆమె పుట్టుక
గర్భంలో చిదమగా
అతడే మిగలగా
అతడు ఆమె బదులు
అతడు అతడు
శృంగార కేళి
వింత వింత భావప్రాప్తుల సృష్టి

మానవ ప్రత్యుత్పత్తి శాస్త్రంలో
విన్నూత్న పరిశోధనల డాక్టరేట్ ల ఆవశ్యం
సంతాన సాఫల్యాల కేంద్రాలు
అతడు అతడు పైనే దృష్టి
గర్భసంచుల కేంద్రాల పారిశ్రామిక ప్రగతి
వృద్ధి రేటు పది పైనే పక్కా

ఇక ఎక్స్ వై ల యుద్దమే
నిందలో కూడా
అతడే అతడే
ఎవరు దాలుస్తారో
మరి ఆ గర్భం

సృష్టి ప్రక్రియలో
జంతువులు ప్రకృతి ధర్మంలో
హాయిగా
మనిషి వికృతిలో
వికారంగా రమించే దౌర్భాగ్యంలో

తప్పు ఎవడిదంటే
ఎక్స్ వై అతడు
మెదడులో భీష్మించుక్కూర్చున్న
మౌఢ్యం

    – గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.