పరిచయం :
మనిషి రోజు రోజుకి మానవత్వం మరిచిపో తున్నాడనడానికి సాక్షలు అక్కర లేదు. రోజు జరుగుతున్న సంఘటనల పరంపర చాలు. మానవ జీవితం ఆదర్శప్రాయమైనది.సకల జంతుజాతులకులేని యోగ్యత మానవజన్మకు ఉందనేది జగమేరిగిన సత్యం. కాని నేటి అత్యధునిక సమజాన్ని గమనిస్తే మనిషి మళ్ళీ పాతరాతియుగాల్లోకి కూరుకుపోతున్నాడా? అనే ప్రశ్న ఉదయించక మానదు. ముందుతరాలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన పెద్దలే తమ విధులకు, బాధ్యతలకు, సామాజిక స్పృహకు, మరియు నైతికవిలువలకు తిలోదకాలు వదులుతున్నారు. తప్పును తప్పని తెలినా చేస్తూ, అంతరాత్మను చంపుకొని కొందరు, అపహాస్యతో కొందరు పది మందితో చేయిస్తూ తాత్కాలిక ఆనందన్ని నటిస్తున్నారు. చివరకు అదే తప్పు వారిని నిలువున దహించివేస్తుందనే సత్యన్ని పూర్తగా మర్చిపోయినట్లున్నారు.
“ఈ భూమి మీద కోటనుకోట్ల మంది మనుషులున్నారు.వీరిలో నిజమైన మనుషులెందరో కనుక్కొవడం కష్టం.మానవత్వం ఉన్నవాడే మనిషి కాగలడు.అది లోపిస్తే మనిషికి, మృగానికి తేడా లేదు“(మానవతా పరిమళం,అంతర్యామి,ఈనాడు దినపత్రిక.)
నేటి మానవ మనుగడకు వ్యక్తిత్వ వికాసమే వరంగ. వ్యక్తి నిర్మాణం జరుగకుండా సమాజ నిర్మాణం సాధ్యం కాదు. వ్యక్తిత్వం సమకూరిన వ్యక్తి మహా శక్తితో సమానం. అదే అతనిని, అతని కుటుంబాన్ని, గ్రామాన్ని, దేశాన్ని రక్షిస్తుంది.