బూర్ల వెంకటేశ్వరరావు వచనకవిత్వం పరిశీలన(సాహిత్య వ్యాసం )-తాటికాయల భోజన్న

ISSN 2278-478

పరిచయం :
సాహిత్య ప్రక్రియల్లో నేడు విస్తృత ప్రచారంలో వచన కవిత్వం ఉందని చెప్పవచ్చు. కవి యొక్క భావానికి ఆటంకం కలుగకుండా పాఠకుని హృదయంలోకి తారాజువ్వలా దూసుకుపోతుంది. మహాకవులు అనేకమంది ఈ ప్రక్రియని వాడుకొని అద్భుత రచనలను వెలువరించారు. ఉదా : శ్రీరంగం శ్రీనివాసరావు (మహాప్రస్తానం ) బలగంగాదర్ తిలక్ (అమృతం కురిసినరాత్రి)మొదలైన రచనలు పతకలోకాన్ని అలరించాయని చెప్పవచ్చు. ప్రస్తుతం రచయితలందరూ వచన కవిత్వాన్ని ఆదరించి తమ రచనలను లోకానికి అందిస్తున్నారు. బూర్ల వెంకటేశ్వర్లు తమ జీవితంలో జరిగిన, చూసిన అనేక అంశాలను అక్షరబద్ధం చేశారు.

1.కవి పరిచయం :

జీవిత సారాన్ని రంగరించి ముందు తరాలకు మార్గాన్ని చూపే ధన్య జీవి కవి. అతని హృదయంలో నుండి ప్రసరించిన గాలి సప్తస్వరాలు పలుకుతుంది. అనేక దెబ్బలు తిన్న అతని మదిలో మంచి కావ్యం ఉదయిస్తుంది. బూర్ల దెబ్బతిన్న పులి. సమాజంలోని అనేక అసమానతలని, అగయిత్యలను చూసి, చూసి మండిన గుండెను మనముందుంచారు. అంతేకాకుండా పల్లెని, తల్లిని, మానవనైజం, ప్రేమ, స్నేహం, గురువు, ప్రభుత్వ వైఖరి, కవి యొక్క అంతరంగం గురించి, రైతు యొక్క బాధలు ఘాథల గురించి మరియు దళారీ వ్యవస్థ గురించి, తెలంగాణాలోని అరాచకాల గురించి, వీరి కవిత్వంలో ఇంకనూ అనేక అంశాలు మనకు కనిపిస్తాయి.

పల్లె గుమ్మిల గుండె బేజారై
మక్క జొన్న గట్కకు
తెల్లజోన్నంబలికి మొకం వాసిపాయె (కరువు పల్లె, పుట : 14, వాకిలి, 2007 )
పల్లెలో తిండికి లేక గ్రామాల్లో అంబలి, గంజి తాగి పస్తులతో కొందరు జీవించసాగారు. పల్లెలో గుమ్మిలో తిండి గింజలు ముందుకాలం కోసం దాచుకుంటారు అవే వారి ఆస్తిపాస్తులు. ఆవి కాళి అయితే వారి దుస్థితి వర్ణించనలవి కాదు. అలాంటి సమయంలో ప్రజలు జొన్న అంబలి, మక్కా గటుక, గంజి తాగుతూ జీవితాన్ని వేల్లదీస్తారు.

‘‘బుక్కెడు బువ్వకోసం పల్లెర్యల పరిగేరుకుంటుంది పల్లె
సర్కారు కంపల్ల సర్కస్సు జేత్తంది’’ (కరువు పల్లె, వాకిలి, పుట : 14, 2007 )
పల్లెరులలో నడక సాగించడం చాలా కష్టం. పై కవితలో బుక్కేడు బువ్వ దొరకని పల్లె పరిగేరుకుంటుందంటాడు రచయిత. సర్కారు కంపల్లో సర్కస్సుచేస్తుంది అనడంలో జీవించడానికి రకరకాల వేషాలు వేయడం నేటి పల్లెను చుస్తే తెలుస్తుంది. పొట్ట చేత పట్టుకొని పట్నాలవైపు పరుగెత్తుతుంది. పరిగేరడం అనగా పంట తీసుకవెళ్ళిన తరువాత గ్రామల్లో ప్రజలు నేటికి అక్కడక్కడ పడిపోయిన దాన్యాన్ని ఏరుకోవడం చేస్తుంటారు.

‘‘అంగిలాగేసినావు ఏడికివోతన్నావని పీరే సాయెబు
మీ నాయనెట్లున్నడని మత్యసు
రెక్కల కట్టమంత దారవోసి ముసలోడు రిక్కోలె ఐండు
మంచిగా జూసుకొండ్రి బిడ్డ పుణ్యమత్తదని చెంద్రత్త’’ (అద్దంల సందమామ, వాకిలి, పుట: 15, 2007 ) గ్రామంలో పెద్దవారిని గౌరవించాలని, తల్లిదండ్రులను అమితంగా ప్రేమించాలని పెద్దలు చాలా మంచి సుద్దులు చెపుతారు. అంతేగాకుండా గ్రామంలో ఏ కులం వారైనను, ఏ మతం వారైనను కలిసి మెలిసి జీవిస్తారు. ఇక్కడ అందరు వరుసలు పెట్టుకొని కుటుంబ సభ్యులవలె జీవిస్తారు. ప్రతి సమస్యను కలిసికట్టుగా ఎదురుకునేవారు. ప్రస్తుతం పల్లె వల్లకాడైంది. వరుసలు వంకరై, ఐకమత్యం వాగుపలైంది.

‘‘మా ఊర్నిండా బంగ్లాలే! జైలు కానాలెక్క!
అన్నికి ఊసల గెట్లే ఎవ్వలకు మందలిచ్చే తీరిక లేదా ఇప్పుడు
అభిమానం :

“నువ్వు !
ఆకాశంలో
వెండి మబ్బులేం కోసుకు రానక్కరలేదు
గుండెల్లో గదులేం కేనించనక్కర్లేదు
అభిమానాన్ని వస్తువుల్లోకి దింపడమంటే
అటాచ్మెంట్నిని నిలువుగా అడ్డంగా కోయడమే” (అటాచ్మెంట్, వాకిలి, పుట : 17, 2007)

సమాజంలో కొందరు మనుషులను , జంతువులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు . మరికొందరు వస్తువులను ప్రాణ పదంగా చూసుకుంటారు. వారు వస్తువులకి ఇచ్చిన ప్రాధాన్యత మనుషులకి ఇవ్వలేరు . “మనం వస్తువులను వాడుకోవడానికి , మనుషులను ప్రేమించాలి కానీ మనుషులను వాడుకుంటున్నాం , వస్తువులను ప్రేమిస్తున్నాం “(పిల్ల జమీందార్ సినిమా ) ప్రేమని, స్నేహాన్ని, అనురాగాన్ని ,ఆప్యాయతని వస్తువుల్లో చూడడం అంటే అటాచ్మెంట్ని నిలువుగా అడ్డంగా కోయడమే అని బాధపడతారు రచయిత. దీనిని బట్టి రచయిత యొక్క సామాజిక స్పృహ, కుటుంబ బాధ్యతలు మనకు అర్ధమవుతాయి.

‘‘అతడు సృష్టి లోపాల్ని దిద్ది తీర్చడానికి
అపర బ్రహ్మై పుడతాడు
అక్షర ప్రవాహాన్ని ఆలోచనా బీజాలుగా నాటుకుంటూ
అంతకంతకు ఎదిగే శిష్య వృక్షాల నీడల్లో
గూడులేని గువ్వలు తలదాచుకున్న దృశ్యాల్ని
స్వప్నిస్తాడు’’ (గురువు, పుట : 22, వాకిలి, 2007)
సమాజం రుజు మార్గంలో నడవడానికి గురువు పాత్ర ముఖ్యమైనది . గురువు లేని సమాజాన్ని ఊహించలేము . “గురువు లేని విద్య గుడ్డి విద్య “ అంటారు పెద్దలు. ఒక వ్యక్తి పరిపూర్ణ జ్ఞానవంతుడు కావడానికి అనుభవాన్ని రంగరించి ఆత్మ జ్ఞానాన్ని అందించే సద్గురువులు నేటికీ అక్కడక్కడా కనిపిస్తారు. నేడు శిష్యులు గురువుకి దూరంగా ఉండడం వలన వారి మధ్య సత్ సంబంధాలు లేకపోవడం చేత అరాచక సమాజంలో వారు భాగామవుతున్నారు . పూర్వ కాలంలో గురు శిష్య సంబంధాలు కుటుంబ సంబంధాల కంటె బలంగా ఉండేవి. కానీ నేడు కుటుంబ సంబంధాలతో పాటు గురు శిష్య సంబంధాలు మరియు సమాజ సంబంధాలు సైతం అంతరించిపోయాయి .

‘‘అనురాగం బ్యాంక్ బాలేన్సుకు
ఆత్మీయత అంతస్తుకు
సానుభూతి పత్రికలకు
పరిమితమైనప్పుడు
మానవత్వాన్ని మింగిన
వైకుంఠ పాళి నాగులతో
కృత్రిమ చిరునవ్వే చెక్కిన
దారు ముఖాలతో
కరచలనం చేయాల్సి వచ్చినప్పుడు
మానవుణ్ణి అయినందుకు
సిగ్గుతో తలదించుకుందాం’’ (సిగ్గుతో, వాకిలి, పుట : 9, 2007)

అనుబంధాలు ఆధునిక సమాజంలో అంధకారంలోకి తొంగి చూస్తున్నాయి. డబ్బును బట్టి అనుబంధాల స్థాయి మన సమాజంలో కనిపిస్తుంది. పూర్వ కాలంలోని ప్రేమలు , మానవ సంబంధాలు , అనురాగాలు . ఆత్మీయతలు పరస్పర సహకారాలు నేడు మచ్చుకైనా కనిపించటం లేదు . మనిషి రోజురోజుకి తనలో స్వార్ధ రాకాసిని నింపుకుని అందరికి దూరంగా ఒంటరి అయిపోతున్నాడు . గొప్ప గొప్ప నాయకులు పత్రికల కోసం సానుభూతిని , అవసరం నిమిత్తం చిరు నవ్వుని తమ ముఖాల పై పులుముకుని చిరునవ్వుకి కొత్త అర్ధాన్ని ఇస్తున్నారు . ఇలాంటి లక్షణాలు కలిగిన అనేక మందిని మనం రోజూ వారి కార్యకలాపాలలో కలుస్తున్నాం , కరచాలనం చేస్తున్నాం . ఇలాంటి పరిస్థితులని ఎదుర్కొన్న రచయిత మనో చిత్రణ వ్యక్తీకరించబడింది .

‘‘నీటి కోసం గునపాలు దింపిన చోట
బుల్డోజర్ దించినా భూ శరీరం స్పందించదు
వెళ్తా మరింత లోతుకు వెళ్తా
భూ అక్షరాన్ని చిదిమి జిలెటిన్ స్టిక్స్ పేలుస్తా
నక్షత్రాలు కనిపించినా నీటి చుక్కలు చేతికి అందవు
దాహార్తితో
జలమో రామచంద్రాని కన్నీరొలికిస్తా’’ (మినరల్ వాటర్, వాకిలి, పుట : 13, 2007)
పూర్వ కాలంలో భూమి పై అనేక సెలయేరులు , వాగులు , కుంటలు , ఒర్రెలు మొదలైనవి నిరంతరము గలగలమని ప్రవహించేవి . ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని స్వార్ధం చేత అడవులు నరక బడి భూమిలో ఉన్నటువంటి చివరి బొట్టు వరకి లాగి వేసి పరిశ్రమలు , కార్ఖాలను , భవనాలకి నీటిని వాడుకుంటున్నాడు . జల సంరక్షణ మాట మరిచిన మానవునికి నీరు కరువై తాగడానికి అవసరాలకి కొనుక్కోవలసిన పరిస్థితి దాపురించింది . ప్రాచీన కాలంలో నీటి యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతుంది కానీ నేటీ కాలంలో కూడా రాష్ట్రాలు , దేశాలు దాహం దాహం అంటూ నీటి కోసం కొట్లాడుతున్నాయి .

ఇలాంటి పరిస్థితుల్లో భూమిలోని చివరి బొట్టుని తీయడానికి మానవుడు చేసిన ప్రయత్నాన్ని రచయిత ఇక్కడ వర్ణించడం జరిగింది . ‘‘మాయమయిన లేఖా ప్రస్థానానికి రాయబారమై
కోల్పోయిన ఆత్మీయ స్పర్శకు శ్రవ్యకావ్యమై
గుండె గుండెనూ కలుపుతుంది
గుడ్డ కప్పుకు తిరిగే ముఖాల్ని
వాస్తవాధీనం చేస్తుంది
ఇప్పుడు
మాటలకందని దృశ్యాలు
మెమరీ పొరల్లో నిక్షిప్తమవుతాయి
రేపు తీరం దాటినా వలస పక్షుల మొఖాలు
అరచేతి రేఖల్లో ప్రత్యక్ష ప్రసారాలవుతాయి
సెల్ అంటే !
అరచేతి దీపంలా
జేబులో జాబిల్లి ముక్కలా
నడిచి వెళ్తున్న స్నేహ వారధిలా ఉంటుంది
సెల్ ఉంటె !
జీవితానికి ఒక సరికొత్త అస్తిత్వం
చెలికానికి ద్వితీయ రూపత్వం
ఇది’’ (స్నేహం వారధి, వాకిలి, పుట : 07,2007)
ప్రపంచీకరణ నేపథ్యంలో సమాజంలో అనేక విద్యుత్ పరికరాలు వచ్చి చేరాయి . వాటి రాకతో మానవ మేధస్సు రోజు రోజుకి కుంచించుకు పోతుంది . మానవుని మధుర జ్ఞాపకాలు మస్తికంలో కంటె కంప్యూటర్ లలో , సెల్ ఫోన్ లలో నిక్షిప్తం కాబడి ఏదో ఒకరోజు కాల గర్భంలో కలిసిపోతున్నాయి . ఈ వస్తువుల వలన ఒకప్పటి లేఖలు మాయమైయ్యాయి . గుండె లోతుల్లో నుంచి వచ్చే భావ స్పర్శ కాస్త కంఠం నుంచి రావడం మొదలు పెట్టింది .

అప్పటికప్పుడు అలవోకగా అనంతమైన పొడి పొడి మాటల్ని సృష్టించే నైపుణ్యాన్ని మానవునికి ఇచ్చింది . వీటి మూలానా గ్రహాంతరాలలోని మనుషులు భూమి పై కనిపిస్తున్నారు . ఖండాంతరాలు , దేశాంతరాలు దాటిన వారు క్షణ కాలంలో ప్రత్యక్షమవుతారు . వారి యొక్క ప్రేమలు , వారి ఆప్యాయతలు , వారి అనుబంధాలు , వారి బాధ్యతలు అన్నీ ఈ ఫోన్ లోనే జరుగుతాయి .ఈ ఫోన్ మనిషికి సరికొత్త అస్తిత్వాన్ని ఇచ్చి అదొక హోదాను తెలియజేస్తుంది . నిరంతరం మనిషిని అంటిపెట్టుకుని ఉండి చెలికానీకి , చెలి కత్తెకి మరొక రూపంగా హొయలు ఒలకబోస్తుంది . ఇది నేటి తరానికి అమూల్యమైన వరంగా వారు భావిస్తారు . దీనితో జరిగే చెడును గమనించక సెల్లులో సొల్లు ప్రేలాపనలు చేస్తుంటారు .
‘‘ప్రభుత్వ ఉత్తర్వుల మేఘాలు
దళారుల ధాన్యరాసుల డీకొని వర్షిస్తాయి ’’ (వాకిలి, పుట : 4, 2007)
సమాజంలో అన్ని రంగాల వారికి సముచిత స్థానం కనిపిస్తుంది .

కానీ ఒక్క రైతుని మాత్రమే చిన్న చూపు చూడటం జరుగుతుంది . తరతరాలుగా యుగయుగాలుగా ఏ మార్పుకి నోచుకోని వారు ఎవరైనా ఉన్నారంటే అది రైతులని చెప్పవచ్చు . దేశానికి పట్టు కొమ్మలు పల్లెటూర్లే అంటారు గాంధీజీ కానీ ఆ పల్లెలు, ఆ పల్లెల్లోని రైతులు నేడు చిన్నాభిన్నం అయ్యి పల్లె అంటేనే భయభ్రాంతులకు లోనవుతున్నారు . వ్యవసాయాన్ని వదిలి వేదనాభరిత హృదయంతో పట్టణాలల్లో తట్టలు మోస్తున్నారు . మిగిలిన కొద్ది మంది రైతులు పండించిన పంటకైనా గిట్టుబాటు ధర కనిపించదు . వారు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను దళారులు రాబందుల్లా వచ్చి ఎత్తుకుపోతారు. ప్రభుత్వ యంత్రాంగము , అధికార గణాలు దళారుల పక్షమే వహించి రైతుని ఒంటరి వాడిని చేస్తాయి . ఈ పరిస్థితులను ఓర్చుకోలేని సున్నిత మనస్కులైన రైతులు ఆత్మహత్యలు చేసుకుని వారి కుటుంబాన్ని అధకారంలోకి నెట్టి వేస్తున్నారు .

ఆధార గ్రంధాలు :
1 . వాకిలి – బూర్ల వెంకటేశ్వర్లు , 2007, అడెప్ట్ డిజిటల్ గ్రాపిక్స్ , కరీంనగర్
2 .రంగుల విల్లు (నానీలు )- బూర్ల వెంకటేశ్వర్లు , 2007, అడెప్ట్ డిజిటల్ గ్రాపిక్స్ , కరీంనగర్
3. బాయి గిరికి మీద ఊర ఇస్క)- బూర్ల వెంకటేశ్వర్లు, 2015, సాహితీ సోబది, కరీంనగర్

-తాటికాయల భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో