మేఘసందేశం-19 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

“కావ్యేషు నాటకం రమ్యం – నాటకేషు శకుంతలా-తత్రాపి చతుర్థాంకం తత్రశ్లోక చతుష్టయోః” అని లోక ప్రాశస్త్యం. కావ్యాల కన్నా నాటకాలు రమ్యమైనవి. నాటకాలన్నింటిలోనూ అభిజ్ఞానశాకుంతలం గొప్పది. ఆ నాటకంలో నాలుగో అంకం మరీ గొప్పది. ఆ శాకుంతల నాటకంలోని చతుర్థాంకపు మొత్తం పాఠంలో ఆ నాలుగు శ్లోకాలు అత్యంత గొప్పదనం కలవి.

కావ్యాలు మన మనస్సుకు హత్తుకొనేలా లోకవృత్తాంతాలనూ వాటి మంచి చెడ్డలనూ బోధిస్తాయి. ఎంత చక్కగా బోధిస్తాయంటే, ఒక మనోహరి ఎంతో ప్రియంగా మాట్లాడుతూ మంచి మాటలు తలకెక్కించినంత సుతారంగా బోధిస్తాయి. కాని వాటికన్నా నాటకాలు శ్రేష్ఠమైనవి. ఒక కావ్యం గొప్పదనం తెలియాలంటే దాన్ని బాగా అధ్యయనం చేయాలి, అది మనస్సు కెక్కాలి అప్పుడు కదా రసానుభూతి కలిగేది?. కాని ఒక చక్కని నాటకాన్ని తిలకించగానే అది మంచి రసానుభూతి కలిగిస్తుంది. అందుకే కావ్యం కన్నా నాటకం గొప్పది. లోకంలో ఎన్నో నాటకాలున్నాయి, కాని వాటిలో అతిప్రశస్తమైనది కాళిదాసు రచించిన శాకుంతలమే! అందులోనూ దాని నాలుగవ అంకంలో రసావిష్కరణ అద్భుతంగా ఉంటుంది. ఆ నాలుగో అంకంలో కూడా నాలుగు శ్లోకాలని ప్రత్యేకించి ప్రస్తావించాలి – కణ్వుడు శకుంతలను అత్తవారింటికి పంపుతూ ఆమెను విడువలేక విడువలేక పలికిన ఆ నాలుగు శ్లోకాలు రసోత్కర్షను కలిగిస్తాయి. అది కదా రసావిష్కరణం అంటే!

కాళిదాస విరచిత “మేఘసందేశం”,”ఋతుసంహారం” అనే కావ్యాలు రెండూ మరింత ప్రత్యెకమైనవి – విషయాన్ని బట్టి చూస్తే అతి విలక్షణమైనవి.మనకి మామూలుగా యెవరయినా యేదయినా గొప్ప కావ్యం రాస్తే అలాంటిదే మనమూ తీసి మనమూ అంతటి గొప్ప వాళ్ళం అనిపించుకోవాలనే ఒక కీర్తి ఖండూతి వుంటుంది.ఒక వసుచరిత్ర కావ్యం మోత మోగించగానే పది పిల్ల వసుచరిత్రలు వచ్చేశాయి! కాళిదాసు తరువాత మందాక్రాంత వృత్తములో వ్రాయబడిన ఖండకావ్యము పవనదూతము. దీని రచయిత ధోయీ కవి. ఇతడు వంగదేశపు రాజైన లక్ష్మణసేనుని (క్రీ.శ.1179-1206) కొలువులో ఉన్నాడు. జయదేవుడు రచించిన సందేశ కావ్యం గీతగోవిందములో చెలికత్తె రాధకు కృష్ణునికి మధ్య సందేశాలను అందజేస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సందేశ కావ్యాలు పుట్టాయి. ఎన్నో కావ్యాలు మేఘసందేశం అనే మూసలో వచ్చినప్పటికీ ఆ రెండు కావ్యాలలో వున్న విషయాన్ని మాత్రం కాపీ కొట్టడానికి యెవరూ సాహసించలేక పోయారు! ఒకటి అందమైన విరహప్రేమతో ముడిపెట్టిన మొదటి ట్రావేలాగ్ లిటరేచర్! రెండోది కధ యేమీ లేకుండా మన చుట్టూ మనకి తెలియకుండానే మారిపోతున్న ఋతువుల్లో మనకి కనిపించే అతి మామూలు దృశ్యాల్ని కొత్తగా వర్ణించి అందంగా చెప్పడం! కేవలం కాళిదాసుకే చెల్లింది. మళ్ళీ మనం మేఘ సందేశంలోకి ప్రవేశిద్దాం.

గత మాసం “తత్రాగారం ధనపతిగృహానుత్తరేణాస్మదీయం” అన్న శ్లోకంతో ముగిస్తూ అలకాపురి పట్టణ వర్ణనను మనోహరంగా తెలియజేస్తూ.. క్రమంగా యక్షుడు తన యింటి గృహం కనుక్కునేందుకు గుర్తులు చెప్తున్నాడు.

శ్లో.15. వాపీచాస్మి న్మరకత శిలా బద్ధ సోపానమార్గా
హేమైశ్ఛన్నా వికచకమలైః స్నిగ్ధవైడూర్యనాలైః
యస్యాస్తోయే కృతవసతయో మానసం సన్నికృష్టం
నాధ్యాస్యంతి వ్యపగత శుచ స్త్వామపి ప్రేక్ష్యహంసాః
.
భావం: మేఘుడా! విను! కుబేరుడు పరిపాలించే యక్షలోకపు రాజధాని యయిన అలకాపురిని చేరిన తరువాత అక్కడ నా యింటి దగ్గర ఉండే ఒక నడబావిని చూడడము మరచిపోవద్దు. ఆ సరస్సు మెట్లు పచ్చలు, అందులో పూచిన బంగారు తామరల తూడులు వైడూర్యాలు, ఆ సరస్సులో ఎన్నో హంసలు ప్రశాంతముగా ఈదుతూ ఉంటాయి, నీ నివాసమేమో మానససరోవరముగా ఉండవచ్చును, కాని అక్కడి హంసలు నిన్ను చూడగానే మానససరోవరానికి వెళ్లాలని ఆత్రపడవు, ఎందుకంటే ఆ సరస్సు ఆ మానససరోవరానికంటే యింకా గొప్పదైనది.

శ్లో. 16. తస్యాస్తీరే రచితశిఖరః పేశలైరిన్ద్రనీలైః
క్రీడాశైలః కనకకదలీవేష్టనప్రేక్షణీయః।
మద్గేహిన్యాః ప్రియ ఇతి సఖే చేతసా కాతరేణ
ప్రేక్ష్యోపాన్తస్ఫురితతడితం త్వాం తమేవ స్మరామి

భావం: ఓ మేఘమిత్రమా! మా ఇంటి దిగుడుబావి ఒడ్డున ఒక చిన్న పర్వతం విహారార్ధమై ఉన్నది. దానిని ఇంద్రనీల మణులచే కప్పబడి ఉంటుంది. బంగారు రంగు గల అరటి బోదెలు ఆ పర్వతం చుట్టూ వ్యాపించి ఉండడం వలన నీకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. నీవు ఎప్పుడైనా మెరుపుతీగను ప్రసరించినప్పుడు నాకు ఆ క్రీడా పర్వతమే జ్ఞప్తికి వస్తూ ఉంటుంది. నా భార్యకు ఆ క్రీడా స్థలము చాలా ప్రియమైనది. ఇందులో ఒక వస్తువును చూడడంతో ఇంకో వస్తువు గుర్తుకు రావడం అనే స్మరణాలంకారము ఉన్నది.

శ్లో.17. రక్తాశోకశ్చలకిసలయః కేసరశ్చాత్ర కాన్తః
ప్రత్యాసన్నౌ కురువకవృతేర్మాధవీమణ్డపస్య।
ఏకః సఖ్యాస్తవ సహ మయా వామపాదాభిలాషీ
కాఙ్క్షత్యన్యో వదనమదిరాం దోహదచ్ఛద్మనాస్యాః

భావం: మా యింటికి దగ్గర ఉన్న క్రీడా పర్వతం మీద గోరింట చెట్ట్లు, దానికి చుట్టూ ఉన్నటువంటి మాధవీ లతా మండపం, దాని ప్రక్కనే ఉన్న ఎర్ర అశోక వృక్షo, కదులుతున్న చిగురుటాకులతో చాలా అందంగా ఉంటుంది. వాటిలో అశోక వృక్షము నా భార్య ఎడమ పాద తాడనం ఎల్లప్పుడూ నా మాదిరిగానే కోరుకుంటూ ఉంటుంది. ప్రక్కనే ఉన్న పొగడ చెట్టు యొక్క మద్యం ఆమె త్రాగిన పుక్కిటి మద్యాన్ని అదేపనిగా కోరుకుంటూ ఉంటుంది.
పూర్వం చెట్లు అకాలంలో పుష్పించాలంటే స్త్రీలు ఎడమపాదంతో తన్నే ప్రక్రియను దోహదమనే వారు. ఐతే యక్షుడు కూడా ఆమె పాద తాడనాన్ని కోరుకోవడం కవి చమత్కారం. కించిత్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

శ్లో.18. తన్మధ్యే చ స్ఫటికఫలకా కాఞ్చనీ వాసయష్టిర్
మూలే బద్ధా మణిభిరనతిప్రౌఢవంశప్రకాశైః।
తాలైః శిఞ్జావలయసుభగైర్నర్తితః కాన్తయా మే
యామధ్యాస్తే దివసవిగమే నీలకణ్ఠః సుహృద్వః॥

భావం: ఓ మేఘుడా! మా గృహంలో ఉన్న అశోక కేసర వృక్షాల మధ్య భాగంలో ఒక స్థంభం ఉంది. అది బంగారు రంగు కలిగి అడుగున పచ్చమణులతో నిర్మించబడినటువంటి ఒక గద్దె కలిగి యుంటుంది. ఆ గద్దెపై స్ఫటికములుగల ఒక పలక కూడా ఉంటుంది. ప్రతిరోజూ నా భార్య తన కంకణస్వరంతో తాళం వేస్తూ ఉండగా మా యింటి నెమలి అక్కడ నృత్యం చెస్తుంది. అలసిపోయిన తర్వాత ఆ నెమలి ఆ గద్దెపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది. ఆ దృశ్యం కన్నులకింపుగా ఉంటుంది.

శ్లో.19. ఏభిః సాధో హృదయనిహితైర్లక్షణైర్లక్షయేథా
ద్వారోపాన్తే లిఖితవపుషౌ శఙ్ఖపద్మౌ చ దృష్ట్వా।
క్షామచ్ఛాయాం భవనమధునా మద్వియోగేన నూనం
సూర్యాపాయే న ఖలు కమలం పుష్యతి స్వామభిఖ్యామ్॥

భావం: ఓ మేఘుడా! జాగ్రత్తగా విను. నేను ఇప్పటివరకు చెప్పిన తోరణాలు మొదలైన గుర్తులతోను, ద్వారానికి రెండు పక్కల ఉన్న శంఖము, పద్మము అనే నిధుల చిత్తరువులతో ఉన్న మా యింటిని నీవు సులభంగా గుర్తుపడతావు సుమా! ఆ యింటి యజమానినైన నేను అక్కడ లేకపోవడం వలన ఆ యిల్లు సూర్యుడు లేక పద్మము తన శోభను ప్రకాశింపలేనట్లుగా ఉంటుంది. యింకా యింటి లోనికి ఎలా ప్రవేశించాలో చెప్తున్నాడు యక్షుడు. ఆవిశేషాలేమిటో వచ్చే మాసం తిలకిద్దాం.

(ఇంకా ఉంది ).

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)