నేను…సైతం(కవిత )-భండారు విజయ

సముద్రాన్ని
ఒడిసిపట్ట బోయాను..
నా చేతిని
రెండు గవ్వలు ముద్దాడాయి

కలలను వలవేసి
బంధించబోయాను
ఎగిసే అలలు వచ్చి
నన్ను కమ్ముకున్నాయి

కాలాన్నీ చుట్టబోయాను
కొన్ని అనుభవాల
ముసుగులు తెరచుకొని
నిద్రపోతున్న జ్ఞాపకాలన్నీ
నాపై విరుచుకపడ్డాయి

చివరి గాలం వేసాను
రెండు కన్నీటి చుక్కలు
బావురుమని రాలిపడ్డాయి

అతని అంతరంగాన్ని
శోధించి గెలవాలని
కొన్ని పదాలు వెదజల్లాను

పరుష వాఖ్యాలతో
ఎదురు దాడి చేస్తూ
అవి నన్నే మింగేసాయి

నేనిప్పుడు…ఓ
వాకిలి అరుగునై
ఇంటి పైకప్పునై
నినాదాలు ఇస్తున్నాను
ఈ జీవితం..
నాది కాదని తేలిపోయింది

బ్రతుకు సమరంలో
సాగుతున్న తుపాకిని
ఎప్పుడన్నా పేలి
నిర్ణయాధికారాన్ని
స్వీకరించక… పోను!

                                                              –భండారు విజయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)