ఆట(కవిత )-డా.సమ్మెట విజయ

తడి ఆరని తీరంపై తేలిన శవం

వత్తిడిని ప్రశ్నిస్తుంది

ఒంటి మీద గాయాలు

ఉబ్బిపోయి మెరుస్తున్నాయి

అస్తవ్యస్త వస్త్రాలు

కారణాలు వెతుక్కుంటున్నాయి

ఏ తల్లి కన్నబిడ్డో

ఏ ప్రేమకు పరాకాష్టో

అందమైన రూపురేఖలు

అంతిమ ప్రస్థానంలో నిలుచున్నాయి

అప్పుల బాధో.., అత్యాచారమో

వరకట్నపు వేధింపో

ఉద్యోగపు వత్తిళ్లో..పేరేదైతేనేం..

ఆమెను వదిలి వెళ్లిన దేహం

మురికి కనిపించని నురుగులో

తెల్లగా మెరుస్తుండగా

ఒక్కసారి ఉప్పెనలా

ప్రేమలు అప్పుడే పుట్టాయి

ఆమె స్థానం భర్తీకోసం

ఆట మొదలయింది..

శవరాజకీయం ఊపందుకుంది.

-డా.సమ్మెట విజయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.