వెనుచూడని విహంగం- కె .గీత

పెనవేసుకున్న బంధం
ఒక్కటి
తంత్రి తెగిపడ్డట్టు
రాలిపోయింది
నిశ్శబ్దంగా
కాలంలో
ప్రవహిస్తున్న
నును వెచ్చని నీరు-
నన్ను నేను ఓదార్చుకోలేక
విహ్వలంగా
వేళ్ల చివర వేళ్లాడే
ద్రవ హృదయం
చాటున
కరడు కట్టి
మూలిగే వేదన
ఎలా తీరుతుంది?
ఎన్ని రాత్రుళ్లు
రోదించినా
వెనుచూడని
విహంగంలా
వెళ్ళిపోయిన
ప్రాణం
దాపున
జ్ఞాపకాలు
వర్తమానమై
మిగిలిన
బహుమానం-
పొద్దు గుంకినప్పటి
వెలుతురు కిరణాల్లా
నిశ్శబ్ద సహజంగా
అందరూ
ఒక్కొక్కరుగా
తెలీకుండానే
రాలిపోవలసిందేనని
తెలిసినా
కరడు కట్టని
జీవితమే
గొప్ప అనుభూతిగా
పెనవేసుకున్న స్నేహం
ఏ అర్థరాత్రో
కుదిపినప్పుడు
తనని తను
ఓదార్చుకోలేక
నిస్సహాయంగా
కళ్లని వేళ్లాడే
ద్రవ హృదయం
ఎప్పటికి తెప్పరిల్లుతుంది?
====

(అత్యంత ఆత్మీయులు పుట్ల హేమలత గార్కి నివాళిగా-)
——-

పుట్ల హేమలత గారి గురించి చెప్పాలంటే దాదాపు ముప్ఫై సంవత్సరాలు వెనక్కు వెళ్లాలి. నేను కొత్తగా కవిత్వం రాస్తున్న రోజుల్లో బొమ్మూరు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కవి సమ్మేళనం లోనికి అందర్లోకి పిన్న వయస్కురాలైన కవయిత్రిగా కవులనీ, కవయిత్రులనీ, విమర్శకులనీ తొలిసారి కలుసుకున్న అద్భుత సభలవి. అప్పటికి ఎండ్లూరి సుధాకర్ గారి భార్య గా మాత్రమే పరిచయమైన హేమలత గారు, 2013 లో నేను ఇండియాకి వెళ్లిన సమయానికి దళిత స్త్రీ సంవేదనాత్మక కవయిత్రిగా, కాలమిస్టుగా, ప్రజాస్వామ్య మహిళా ఉద్యమ నేతగా, పరిశోధకురాలిగా, తెలుగు విశ్వద్యాలయ ఆచార్యులుగా, విహంగ వెబ్ పత్రికాధినేతగా ఎదిగి, అనేకమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఇద్దరు పిల్లల తల్లిగా, ఇంటి బాధ్యతలతో పరిమితం చేసుకోగలిగిన జీవితాన్ని అనునిత్యం సంఘర్షణాత్మకమైన ఆధునిక జీవనంగా మలచుకుంటూ, అడుగిడిన చోటల్లా విజయాల్ని స్వంతం చేసుకుంటూ అత్యున్నత స్థితికి ఎదగడం లో హేమలత గారు పొందిన అంతర్లీన సంవేదనని, ఎదుర్కొన్న ప్రతిబంధకాల్ని, వేసిన ప్రణాళికాబద్ధమైన అడుగుల్ని, పాటించిన క్రమశిక్షణని, చేసిన అనేక త్యాగాల్ని తల్చుకున్నప్పుడల్లా, ఆమెకు ఆప్తురాలిని అయినందుకు గొప్ప గర్వకారణంగా ఉంటుంది నాకు. 2011 లో విహంగ తొలినాళ్ల నుండీ ఆగకుండా వస్తున్న నా “నా కళ్లతో అమెరికా” యాత్రాకథనాలు అందిన ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఈ-ఉత్తరాలతో పలకరించే హేమలత గారి ఆత్మీయాక్షరాలు ఇక ఎక్కడి నుంచి అందుకోను? వారి ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేని, పెగలని గద్గదమైన గొంతుతో, ఎడతెరిపిలేని, ఆరని కన్నీళ్లు బాదుకుంటున్న గుండెతో నివాళులెలా అర్పించను? ఇదంతా నిజమేనని, నిక్కచ్చిగా ఎదురవుతున్న వాస్తవంలో హేమలత గారు ఇక లేరని సుధాకర్ గారిని, పిల్లలు మానసనీ, మనోజ్ఞనీ ఎలా ఓదార్చను?

-డా|| కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)