వీక్షణం సాహితీ సమావేశం-78 -వరూధిని

వీక్షణం 78 వ సాహితీ సమావేశం కాలిఫోర్నియా బే ఏరియాలోని ప్లెసంటన్ లో ఫిబ్రవరి 10, 2019 న శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు, శ్రీమతి ఉమా వేమూరి గారి ఇంట జరిగింది.

ఈ సమావేశానికి శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు అధ్యక్షత వహించారు.

ఈ సభలో ముందుగా శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారి కథ “ఉద్యోగం” మీద కథా చర్చ జరిగింది. కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు. ఒక మధ్యతరగతి వాడు ఉద్యోగం కోసం ఎన్ని పాట్లు పడాలో వివరించే కథ ఇది. ఇక కథ పట్ల సభలోని వారు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతూ, చిన్న చిన్న విషయాలు వివరంగా చెప్పడం కొ.కు స్టైల్ అనీ, కథాంశం కంటే చెప్పే విధానం చాలా బావుందని, కథ చదువుతున్నపుడు కాలమానపరిస్థితులు చక్కగా తెలుసుకోగలిగిన కథ, ఆశ, నిరాశల మధ్య ఊగిసలాటని వ్యంగ్యంగా చెప్పడం బావుందని, కథ వేగంగా నడిచినా కథలో వేగం లేదని, చిన్న ఉద్యోగి కేపిటలిస్టిక్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలియజెప్పే కథ అనీ అన్నారు.

తరువాత కథా రచయిత్రి రాధిక తన పేరిట ప్రతీ సంవత్సరం అందజేసే రాధికా సాహితీ అవార్డుని ఈ సంవత్సరం శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు గారికి అందజేసారు. ఈ సందర్భంగా వేమూరి జీవిత విశేషాలను, రచనల ద్వారా వారు సాహితీ లోకానికి చేస్తున్న సేవను డా||కె.గీత సభకు వివరించారు.

ఆ తర్వాత శ్రీమతి రాధిక “అనగనగా ఒక రోజు” అంటూ స్వీయ కథా పఠనం చేసారు. రోజు మొత్తమ్మీద ఎదురయ్యే పురుగూపుట్రా జీవితంలో ఎలా తప్పవో వివరిస్తూ, అనుక్షణం పీడించే భర్తను క్రిమితో పోలుస్తూ ముగించడం కొసమెరుపు.

విరామం తర్వాత డా||కె.గీత శ్రీమతి పుట్ల హేమలత గారి కవిత “జ్ఞాపకాల తెరలు”ను సభకు చదివి వినిపించారు. హేమలత గారు తనకెంతో ఆత్మీయులని పేర్కొంటూ, వారి జీవిత విశేషాలను, రచనలను, “విహంగ” పత్రికాధిపతిగా వెబ్ పత్రికా రంగంలో సలిపిన కృషిని వివరించారు. తరువాత ఆమెకు నివాళి గా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఆ తరవాత శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ ఆసక్తిదాయకుల్ని చేస్తూ అలరించింది.
ఈ సమావేశానికి కొత్తగా విచ్చేసిన శ్రీ ఫణీంద్ర స్వీయ పరిచయం, శ్రీమతి ఉదయలక్ష్మి గారి షేక్స్పియర్ “సోలిలోక్వీ” (స్వగతం) గురించిన పరిచయం తర్వాత, కవిసమ్మేళనంతో సభ విజయవంతంగా ముగిసింది.

స్థానిక ప్రముఖులు శ్రీ మృత్యుంజయుడు, శ్రీ లెనిన్, శ్రీ కృష్ణకుమార్, శ్రీమతి శారద, శ్రీమతి షర్మిల మొ.న వారు ఈ సభలో పాల్గొన్నారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)