అమ్మ(కవిత )-సామల కిరణ్

సృష్టిలోన గొప్ప సృజన అమ్మ
ఆ అమ్మే మళ్ళీ ఈ సృష్టికి మూలం
ఆత్మీయత అనురాగాల కలబోత
ఆత్మ తత్వం బోధించే ఓ జ్ఞానసమేత…
పేగుబంధంతో
పేరు తెచ్చుకునేలా
సంస్కారం అందించే గురువు….
ఆత్మబంధంతో
అవని గెలిచేలా
ఆసరాని అందించే కల్పతరువు……..
అమ్మ పదంలోనే ఎంతో కమ్మదనం
అమ్మని విడువని జీవితం ఓ నందనం…..
అమ్మ అంటేనే ఓ ధర్మమూర్తి
అమ్మ అంటేనే ఓ కర్మమూర్తి
అమ్మే లేకుంటే
ఈ లోకంలో ధర్మమర్మం లేదు…..
అమ్మే లేకుంటే
ఈ ప్రపంచంలో కర్మసూత్రం లేదు…..
పని చేయటంలో అలుపు లేదు
పాడి నిలుపుటలో మరుపు లేదు
పనిలో ధర్మం అందించి
పనియే దైవంగా భావించి
పరమ తత్వం ఎఱుకపర్చిన
పరమ గురువు అమ్మే!!!!
అమ్మని తలచేందుకు ఓ రోజు అక్కర్లేదు!
అనుక్షణం అండగా ఉండటమే ఓ మాతృభక్తి!
మరువద్దు మరువద్దు ఓ అమ్మబిడ్డల్లారా…….
మరణం దాకా విడువకుండా చూడటమే మాతృభక్తి!!

సామల కిరణ్,తెలుగు అధ్యాపకుడు, కరీంనగర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)